అతి త్వరలో విశాఖకు  సిఎం వైయ‌స్‌ జగన్  

Best Web Hosting Provider In India 2024

శ్రీ‌కాకుళం:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని విశాఖ‌నే అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అఫీషియల్ గా  స్వయంగా చెప్పార‌న‌ని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు అన్నారు. అతి త్వరలో శుభ ముహూర్తాన విశాఖలో సిఎం వైయ‌స్‌ జగన్ అడుగు పెట్టబోతున్నారని తెలిపారు.  శ్రీకాకుళం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయం నిర్మాణానికి పెద్ద పాడు జాతీయ రహదారి సమీపంలో మంత్రి సీదిరి అప్పలరాజు బుధ‌వారం శంఖుస్థాపన చేశారు .  ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొందరు ఏపి కి రాజధాని ఏది అంటూ వ్యంగంగా మాట్లాడుతున్నారు. మాది ఆంద్రప్రదేశ్ -మా రాజధాని విశాఖ ..అందరూ గుర్తుపెట్టుకోండి అని స‌మాధానం చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా తీసుకెల్లేందుకు అనేక అధ్యాయనాలు చేసి విశాఖని పరిపాలనా రాజధానిగా నిర్ణయించామ‌న్నారు. అన్ని ప్రాంతాల వారిని ఒకేరీతిలో చూడాలనేధి మా భావన. అందుకే వికేంద్రీకరణ చేయాలనుకున్నాం. కొందరు కోర్టులకు వెళ్లి ముందరి కాళ్లకు బంధం వేయాలని చూస్తున్నారు. వారి మనుషల కోసం అమరావతి లాంటి ల్యాండ్ స్కాం ను తయారు చేశారు చంద్రబాబు. 
చంద్రబాబు కు వైయ‌స్ జగన్ ప్రకటన చెంపపెట్టు లాంటిద‌ని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు అన్నారు . అమరావతి యాత్ర పేరుతో చంద్రబాబు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూశారు..  ప్రజల నుంచి వ్యతిరేక‌తతో ఆపివేసారు. లోకేష్ కి బట్టలు ఊడదీసి కోట్టే పరిస్థితి బాదుడే బాదుడులో కలిగింది. లోకేష్ ని బ‌లవంతంగా నడిపిస్తున్నారు. లోకేష్ ని పాదయాత్ర చేయించగలరుకాని ..స్పందనని ప్రజల్లో తెప్పించలేర‌న్నారు. పది మంది కూడా లేకుండా వెర్రిబాగులోడులా .. పాదయాత్ర చేస్తున్నాడు లోకేష్. పాదయాత్రని ఎవరూ పట్టించుకోవడం లేదు. జన ప్రవాహం లోకేష్ వెంట ఉందని చూపించండి. పాదయాత్ర గురించి మరి మాట్లాడదలుచుకోలేద‌ని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు పేర్కొన్నారు. 

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *