ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) మొండితోక అరుణ్ కుమార్ కలిసి జర్నలిస్ట్ కార్పొరేషన్ కోసం వినతి పత్రాన్ని అందించారు…


జర్నలిస్టుల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది:

@- ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్

నందిగామ, వార్తా ప్రపంచం, ఆగస్టు 02: జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూ జర్నలిస్టుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక జర్నలిస్టు అసోసియేషన్.. అతి తక్కువ కాలంలో భారత దేశంలోనే ఎక్కువ సభ్యులను కలిగిన అసోసియేషన్ గా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ గుర్తింపు పొందింది. జర్నలిస్ట్ సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని 28 డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు అందజేసి సమస్యలపై చర్చించి జర్నలిస్టుల మనుగడ కోసం నిరంతరం పోరాడుతుంది..

జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నో రకాల పోరాటాలు చేసినా కూడా జర్నలిస్టుల బ్రతుకుల్లో ఎలాంటి మార్పు లేకపోవడం తో జర్నలిస్టుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిపోయింది.. జర్నలిస్టుల సంక్షేమానికి “జర్నలిస్టుల కార్పొరేషన్” ను ఏర్పాటు చేస్తేనే ఫలితం ఉంటుందన్న ఉద్దేశంతో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను, ప్రజా ప్రతినిధులు కలిసి జర్నలిస్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు నిరంతరం పోరాటానికి సిద్ధమయింది..

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) మొండితోక అరుణ్ కుమార్ కలిసి జర్నలిస్ట్ కార్పొరేషన్ కోసం వినతి పత్రాన్ని అందించారు…

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో మొదటి స్థానం నిలిచిందన్నారు.. కులం, మతం, ప్రాంతం చూడకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరికీ న్యాయం చేస్తున్నారన్నారు.. అలాంటిది ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ ఆయిన జర్నలిస్టుల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందన్నారు.. జర్నలిస్టుల కార్పొరేషన్ కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి తో ప్రత్యేకంగా మాట్లాడి కార్పొరేషన్ తప్పనిసరిగా ఏర్పాటు చేసేటట్లు చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తానని ఈ సందర్భంగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకులకు ఆయన హామీ ఇచ్చారు…

“జర్నలిస్టుల కార్పొరేషన్” ఏర్పాటుపై సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) మొండితోక అరుణ్ కుమార్ కు ఎన్.ఎ.ఆర్.ఎ ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు కృతజ్ఞతలు తెలియ చేసారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) మొండితోక అరుణ్ కుమార్ ని కలసిన వారిలో జాతీయ అధ్యక్షులు సురేంద్ర బాబు తో పాటు ఆంధ్రప్రదేశ్ ఎన్.ఏ.ఆర్.ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు మక్కెన సురేంద్రబాబు, ఎన్.ఏ.ఆర్.ఏ నందిగామ రెవెన్యూ డివిజన్ అధ్యక్షులు పసుపులేటి వెంకట సూర్యప్రకాష్, నందిగామ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మిరియాల వీరేంద్ర, నందిగామ నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ మార్కపుడి మధు, నందిగామ నియోజకవర్గ జాయింట్ సెక్రటరీ మల్లేశ్వరరావు, నందిగామ టౌన్ ప్రెసిడెంట్ షేక్ రహీం, కంచికచర్ల మండల సెక్రెటరీ నరేష్, నందిగామ నియోజకవర్గ కమిటీ సభ్యులు సుమన్ దేవ్, కోమటి కిషోర్, శ్రీకాంత్, రిపోర్టర్స్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *