Best Web Hosting Provider In India 2024

విజయనగరం: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేలా గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు కృషి చేయాలని వైయస్ఆర్‌సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ లో సచివాలయ కన్వీనర్లు, గృహసారథులకు శిక్షణ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజా రంజక పాలన అందిస్తున్న సీఎం వైయస్ జగన్‌కు మనమంతా అండగా ఉండాలన్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ 2024 ఎన్నికలలో జగనన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సమన్వయంతో పని చేయాలన్నారు. ఇంకా ఎవరికైనా ప్రభుత్వ పథకాలు అందకపోతే వారి సమస్యను తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులకు సమాచారం ఇచ్చి గృహసారథులు తోడుగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసులు, నెల్లిమర్ల ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు.