CM CBN Amaravati Tour : A అంటే అమరావతి, P అంటే పోలవరం – సీఎం చంద్రబాబు

Best Web Hosting Provider In India 2024


CM Chandrababu Amaravati Tour : ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటించారు. అమరావతికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంతో పాటు పలు నిర్మాణాలను పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు…. అమరావతి రైతులు 1,631 రోజులు ఆందోళన చేపట్టారని గుర్తు చేశారు.  అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదన్నారు. అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శమని కొనియాడారు. అమరావతిని ప్రపంచం అంతా గుర్తించిందిన్న ఆయన… A అంటే అమరావతి, P అంటే పోలవరం అని చెప్పుకొచ్చారు.

గత ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేసిందని చంద్రబాబు విమర్శించారు. ఈ ప్రాంతంలో పైపులు, రోడ్డు, మట్టిని దొంగతనం చేస్తున్నా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. దుర్మార్గమైన పాలన నుంచి అమరావతిని దేవుడే కాపాడారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

గత ఐదేళ్ల పాలనలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావేదికను కూల్చివేయించిన చరిత్ర జగన్ ది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదన్నారు.

 

 

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్

Chandrababu NaiduAndhra Pradesh NewsAmaravatiTdp

Source / Credits

Best Web Hosting Provider In India 2024