TG DSC 2024 Updates : డీఎస్సీకి దరఖాస్తు చేశారా..? ఇవాళే చివరి తేదీ, పరీక్షలు ఎప్పట్నుంచంటే…?

Best Web Hosting Provider In India 2024


Telangana DSC 2024 Updates : తెలంగాణ డీఎస్సీ ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ముగియనుంది. విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… జూన్ 20వ తేదీతో పూర్తి కానుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఫీజు చెల్లింది… దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌ లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.

గతేడాది చివర్లో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ను(TS DSC Notification 2024) కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. పోస్టులను సంఖ్యను పెంచి కొత్తగా నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఈ కొత్త నోటిఫికేషన్ లో భాగంగా 11,062 ఖాళీలను భర్తీ చేయనుంది. అయితే గతంలో కేవలం 5వేలకుపైగా పోస్టులతోనే నోటిఫికేషన్ వచ్చింది.

విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. జూన్ 20వ తేదీతో డీఎస్సీ దరఖాస్తుల గడువు పూర్తి అవుతుంది. దాదాపు 2. 60 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. నిజానికి ఏప్రిల్ 3వ తేదీతోనే దరఖాస్తుల గడువు పూర్తి కావాల్సి ఉండేది. కానీ టెట్ ఫలితాల విడుదల నేపథ్యంలో… జూన్ 20వ తేదీ వరకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. కొత్తగా టెట్ లో క్వాలిఫై అయినవారి కోసం గడువును పొడిగించింది.

ఇదే సమయంలో డీఎస్సీ దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ ను కూడా అందుబాటులోకి వచ్చింది. కొత్తగా టెట్ పరీక్షలో అర్హత సాధించిన వారు తమ వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో మరోసారి ఎడిట్ ఆప్షన్ ను తీసుకొచ్చింది. అంతేకాకుండా… టెట్ 20024లో అర్హత సాధించిన వారికి ఒకసారి డీఎస్సీ పరీక్షకు ఫ్రీగా అప్లికేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంది.ఇక ఈ ఎడిట్ ఆప్షన్ ను ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుందని… ఆ తర్వాత ఓపెన్ కాదని విద్యాశాఖ స్పష్టం చేసింది.

జూలై 17 నుంచి డీఎస్సీ పరీక్షలు

జులై 17 నుంచి తెలంగాణ డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. జూలై 31వ తేదీ వరకు వరకు ఆన్‌లైన్‌ లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. భర్తీ చేయనున్న మొత్తం 11,062 ఉద్యోగాల్లో….2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 ఉద్యోగాలు ఉన్నాయి.

డిఎస్సీ 2024(TS DSC Exam 2024) ఉద్యోగాల భర్తీని కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) కింది “ఆన్‌లైన్”‌లో నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 160 ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది.

డీఎస్సీ పరీక్షలో జనరల్ నాల్డెజ్, టీచింగ్ తో పాటు సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. మిగతా 20 మార్కులకు టెట్(TS TET ) వెయిటేజ్ ఉంటుంది. రాతపరీక్ష తర్వాత టెట్ *(TS TET Exam)వెయిటీజీని కలిపి తుది జాబితాను ప్రకటిస్తారు

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్

Ts Dsc JobsTs Dsc Notification 2023Telangana NewsEducation

Source / Credits

Best Web Hosting Provider In India 2024