Kalki 2898 AD Runtime: ప్రభాస్ కల్కి 2898 ఏడీ రన్‌టైమ్ రివీల్.. చాలా పెద్ద సినిమానే..

Best Web Hosting Provider In India 2024


Kalki 2898 AD Runtime: ప్రభాస్, దీపికా పదుకోన్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. మూవీ రిలీజ్ కు వారం రోజుల ముందు సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రన్ టైమ్ చాలా ఎక్కువగానే ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో చాలా అరుదుగా ఇంతటి రన్ టైమ్ ఉండటం చూడొచ్చు.

కల్కి 2898 ఏడీ రన్ టైమ్

కల్కి 2898 ఏడీ మూవీకి సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ లోనే మూవీ రన్ టైమ్ రివీలైంది. ఈ ప్రభాస్ మూవీ ఏకంగా 3 గంటల 56 సెకన్ల రన్ టైమ్ తో రానుండటం విశేషం. ఈ మూవీ స్టోరీ, ఇందులో వాడిన గ్రాఫిక్స్, ప్రభాస్ పాత్ర భైరవ వాడిన బుజ్జి అనే కారు అభిమానుల్లో ఎంతో ఆసక్తి రేపుతోంది. మూడు గంటలైనా కూడా మూవీ ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేసేలా ఉండబోతోందని ఇప్పటికే సెన్సార్ సభ్యుల రివ్యూలు చెబుతున్నాయి.

కల్కి 2898 ఏడీ మూవీకి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే రోజుకు ఐదు షోలు కూడా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో 3 గంటల రన్ టైమ్ థియేటర్ల యజమానులకు కాస్త ఇబ్బందే అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో సెన్సార్ సభ్యులు చాలా కొద్ది మార్పులు మాత్రమే చేసినట్లు కూడా సర్టిఫికెట్ చూస్తే స్పష్టమవుతోంది.

కల్కి 2898 ఏడీ స్టోరీ ఇదే..

ఇక కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ కు వారం ముందు ఈ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా స్టోరీ కూడా రివీల్ చేశాడు. ఇది మూడు ప్రపంచాల చుట్టూ తిరిగే కథ అని అతడు వెల్లడించాడు.

కల్కి 2898 ఏడీ మూవీ మొత్తం కాశీ, కాంప్లెక్స్, శంబాలా ప్రపంచాల చుట్టూ తిరగనుంది. ప్రపంచంలో చిట్టచివరి నగరం కాశీ మూడు వేల ఏళ్ల తర్వాత ఎలా ఉండనుంది? అప్పటి మనుషులు, వారి వేషధారణ, వాళ్లు వాడే వాహనాలు, ఆయుధాలు.. ఇలా అన్నింటినీ ఊహించి మూవీ కోసం తయారు చేసినట్లు నాగ్ అశ్విన్ చెప్పాడు.

ఆ కాశీ పైన ఉండే కాంప్లెన్స్ అనే మరో ప్రపంచంలో అన్నీ ఉంటాయి. డబ్బు, పచ్చదనం, నవ్వులు.. ఇలా కాశీలో లేనివన్నీ అక్కడ కనిపిస్తాయి. వాళ్ల ప్రపంచం, వాళ్లు తినే ఆహారం, ఆయుధాలు ఇలా అవన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఇక సినిమాలో కనిపించే మూడో ప్రపంచం శంబాలా. కల్కి అవతారం ఇక్కడే జన్మిస్తుందని మన పురాణాల్లో చెప్పినట్లుగా ఈ నగరాన్ని క్రియేట్ చేసినట్లు నాగ్ అశ్విన్ చెప్పాడు.

కథ ఏంటో డైరెక్టర్ చెప్పేశాడు. దానిని స్క్రీన్ పై ఎలా చూపించాడన్న ఆసక్తి ఇప్పుడు నెలకొంది. నాగ్ అశ్విన్ సృష్టించిన ఆ మూడు ప్రపంచాలు ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటాయన్నది మరో వారం రోజుల్లో తేలిపోనుంది.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024