Best Web Hosting Provider In India 2024

గుంటూరు: అందరూ కలిసి పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుద్దామని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. బెల్లంకొండ మండలం వన్నాయపాలెం గ్రామానికి చెందిన సుమారు 50 టీడీపీ కుటుంబాలు బుధవారం ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరాయి. గుంటూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో కండువాలు కప్పి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. టీడీపీ చేసిన అవినీతి.. ప్రస్తుతం తమ ప్రభుత్వం చేస్తున్న మంచితో పాటు జరిగిన అభివృద్ధిని చూసి ఎంతోమంది తమ పార్టీలో చేరుతున్నారన్నారు. వన్నాయపాలెంలో టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, మూడున్నరేళ్ల కాలంలో తమ పాలనలో జరిగిన అభివృద్ధితో తేడాను ప్రజలు గమనించారన్నారు. అందుకే స్వచ్చందంగా వైయస్ఆర్‌సీపీ లో చేరుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు ఎప్పుడు ఏ అవసరమొచ్చినా.. నేరుగా తనను సంప్రదించొచ్చని చెప్పారు. టీడీపీ నుంచి వైయస్ఆర్‌సీపీలో చేరిన వారిలో వన్నాయపాలెం గ్రామానికి చెందిన మేకల వాసు, మేకల పుల్లారావు కోటేశు, మేకల సాంబశివరావు, జంపాని హనుమంతరావు, అత్తి శ్రీనివాసరావు, బాదరబోయిన రామయ్య, గాదం రామారావు, దేవాంగుల పెదకొండలు, షేక్ పెదనన్నే సాహెబ్, దేవండ్ల వెంకటయ్య, కొంగవరపు బ్రహ్మం, పత్తిపాటి జగన్నాథం, పత్తిపాటి రంగయ్య, మేకల పెదవెంకటేశ్వర్లు, దాసరి గరిటయ్య, బొప్పూడి లక్ష్మీ, పత్తిపాటి రాజేశ్వరి, షేక్ నబీ, మేకల ఆదెమ్మ తదితరులున్నారు.