Best Web Hosting Provider In India 2024

అమరావతి: వైయస్ఆర్ కళ్యాణమస్తు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. కేబినెట్ భేటీలో బడ్జెట్ సమావేశాలు, పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ప్రధానంగా 70 అజెండా అంశాలపై క్యాబినెట్ చర్చించింది. కర్నూలులో జాతీయ న్యాయ విద్యాలయం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైయస్ఆర్ లా నేస్తం, వైయస్ఆర్ ఆసరా, ఈబీసీ నేస్తం, వైయస్ఆర్ కల్యాణ మస్తులను మంత్రి వర్గం ఆమోదించింది.భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు ప్రతిపాదనలను కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపారు. సుమారు రూ.లక్షా 45 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. న్యూఎనర్జీ పార్క్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.. 2 విడతల్లో మొత్తంగా రూ.1.10 లక్షల కోట్లతో న్యూఎనర్జీ పార్క్.. 1000 మెగావాట్ల చొప్పున విండ్, సోలార్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.