Best Web Hosting Provider In India 2024

న్యూఢిల్లీ: టర్కీ, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు చిక్కుకున్నారని, వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ను కోరినట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధుల వంటి వాటిపై పార్లమెంటులో ప్రశ్నించినట్లు వారు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైయస్ఆర్ సీపీ ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, పోచా బ్రహ్మానందరెడ్డి, తలారి రంగయ్య, రెడ్డప్ప విలేకరుల సమావేశం నిర్వహించారు.