జ‌గ‌న‌న్న‌..మీ ధైర్యానికి హ్యట్సాఫ్……….మంత్రి మేరుగ నాగార్జున

తాడేప‌ల్లి:  ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ధైర్యానికి హ్య‌ట్సాఫ్ అని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వైయ‌స్ఆర్‌ కళ్యాణమస్తు,  వైయ‌స్ఆర్ షాదీ తోఫా ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా అక్టోబర్‌ – డిసెంబర్‌ 2022 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు వైయ‌స్ఆర్‌ కళ్యాణమస్తు, వైయ‌స్ఆర్  షాదీ తోఫా క్రింద రూ. 38.18 కోట్ల ఆర్ధిక సాయాన్ని క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ న‌గ‌దును జమ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడారు.

అందరికీ నమస్కారం, ఈ రోజు వైయ‌స్ఆర్‌ కళ్యాణమస్తు, వైయ‌స్ఆర్‌షాదీ తోఫా అనే గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్రంలోని పేద కుటుంబాలకు అండగా, సహాయంగా ఉంటాయి. ఇది చాలా గొప్ప కార్యక్రమం. సీఎంగారు చదువుకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో అర్ధమవుతుంది. నాడు బీఆర్‌ అంబేద్కర్‌గారు ఎడ్యుకేషన్‌ ఈజ్‌ ద వెపన్‌ అన్న మాట అమలుచేస్తున్నారు. డ్రాపౌట్స్‌ రేట్స్‌ తగ్గాయి, ఇటీవల మైసూర్‌ లో జరిగిన ఒక కాన్ఫరెన్స్‌లో 9 రాష్ట్రాల వారు వచ్చిన సమావేశంలో ఒక్క ఏపీలోనే ఈ రోజు డ్రాపౌట్స్‌ శాతం తగ్గుతుందని చెప్పారు, ఇది గర్వకారణం. పదవ తరగతి పాసైన వారికే అర్హత అనేది మంచి ఆలోచన, దీని వల్ల చదువుకు ప్రాధాన్యతనిస్తారు. మీ ధైర్యానికి హ్యట్సాఫ్, మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఫలప్రదమవుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈ గొప్ప కార్యక్రమాల వెంట ప్రజలంతా నడుస్తారని కోరుకుంటున్నాను. ధ్యాంక్యూ.

ధన్యవాదాలు అన్నా: సువర్ణ రత్న, లబ్ధిదారు, మర్రివలస గ్రామం, అనంతగిరి మండలం, ఏఎస్‌ఆర్‌ జిల్లా

నమస్కారం జగనన్నా, అన్నా మా నాన్న కూలీ పనులు చేసి మమ్మల్ని చదివించారు, మమ్మల్ని ప్రయోజకులను చేశారు, పెళ్ళి చేయాలనుకుని ఆలోచిస్తుండగా మాకు ఈ కళ్యాణమస్తు ద్వారా ఆర్ధిక సాయం జరుగుతుందని తెలిసి మేం సంతోషించాం, మాకు ఈ సాయం అందుతుంది, ధన్యవాదాలు అన్నా, మా నాన్న మమ్మల్ని చదివించడానికి చాలా ఇబ్బందులు పడ్డారు, మీరు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు అందాయి, మేం పోడు భూములు సాగుచేసుకుంటున్నాం, మీరు మాకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టా ఇవ్వడంతో మాకు రైతు భరోసా సాయం అందుతుంది, ఆ డబ్బుతో మేం వ్యవసాయం చేసుకుంటున్నాం, మా అమ్మకు వైయ‌స్ఆర్‌ చేయూత, ఆసరా అందుతున్నాయి, మా జీవనోపాధి మెరుగైంది, మా చెల్లి కూడా మీ పథకాల వల్ల సాయం పొందింది. మీరే మాకు ఎప్పటికీ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాను. మా నాన్నకు కుమారులు లేరు, మీరు మాకు అన్నగా ముందుండి నడిపించారు, మా కుటుంబం తరపున, మా పేదలందరి తరపునా మీకు ధన్యవాదాలు అన్నా. ధ్యాంక్యూ.

మేమంతా మీకు రుణపడి ఉన్నాం: లక్ష్మీదేవి, లబ్ధిదారు, రెడ్డివారిపల్లి గ్రామం, తిరుపతి జిల్లా

అన్నా నమస్తే, మీరు ప్రవేశపెట్టిన వైయ‌స్ఆర్‌ కళ్యాణమస్తు వల్ల మాకు మేలు జరిగింది. దీని వల్ల మాలాంటి చాలామంది ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారు. కన్నతండ్రికి కూతురు పెళ్ళి చేయాలంటే ఎంత భారమో తెలుసు, కానీ మీరు ఈ పథకం ద్వారా సాయం చేస్తున్నారు. తండ్రులంతా కూడా మా కొడుకులాగా మీరు సాయం చేశారని గర్వంగా చెప్పుకుంటున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను, నాలాంటి ఎన్నో కుటుంబాలు ఇదే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మేం ఐదుగురు ఆడపిల్లలం, మీరు ప్రవేశపెట్టిన విద్యాదీవెన, వసతిదీవెన ద్వారా డిగ్రీ పూర్తిచేయగలిగాం, మా నాన్నగారు మమ్మల్ని ధైర్యంగా చదివించారంటే మీరే కారణం, మా చెల్లెల్లకు కూడా అన్ని పధకాలు అందుతున్నాయి, మేం స్కూళ్ళో చదువుకున్న రోజుల్లో ఇవన్నీ లేవు, తనకు ట్యాబ్‌ కుడా ఇవ్వడంతో మరింత ఇంట్రెస్ట్‌ గా చదువుకుంటుంది, మేం ఐదుగురు ఆడపిల్లలం చదవగలిగాం అంటే మీ పథకాల వల్లే, అందరూ ఆశ్చర్యంగా చూశారు ఎలా చదువుతారని, కానీ మీ పథకాల వల్లే మేమంతా చదవుకున్నాం, మేమంతా గర్వంగా ఫీల్‌ అవుతున్నాం, ఎంతోమంది కుటుంబాలకు మీరు మేలు చేస్తున్నారు, మేమంతా మీకు రుణపడి ఉన్నాం, మీరే ఎల్లప్పుడూ మాకు సీఎంగా ఉండాలని ఏడుకొండలవాడిని వేడుకుంటున్నా అన్నా, ధ్యాంక్యూ.

మళ్ళీ మళ్ళీ సీఎం అవ్వాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నా: షేక్‌ సాబా కౌసర్, లబ్ధిదారు, కర్నూలు

నమస్కారం, మా తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ బతుకుతుంటారు, మా వలంటీర్‌ వచ్చి ఈ పథకం గురించి చెప్పడంతో మా అమ్మా నాన్న చాలా సంతోషపడ్డారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఏ ఒక్కరూ కూడా రూపాయి సహాయం చేయరు కానీ మీరు మాత్రం లక్ష రూపాయల సాయం చేస్తున్నారు, చాలా సంతోషం. మా కమ్యూనిటీలో చాలా మంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి, వారందరికీ పిల్లల పెళ్ళిళ్ళు భారంగా మారాయి, మీరు చేస్తున్న సాయం చాలా ఉపయోగకరం, అలాగే మీరు పదో తరగతి చదవాలని, వయసు 18 నిండాలన్న నిబంధన పెట్టడంతో అందరూ చదివిస్తున్నారు, దీంతో బాల్యవివాహాలు ఆగిపోయాయి, మీ నాన్న వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి గారు ముస్లిం, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో ఎంతోమంది డాక్టర్లు అవుతున్నారు, ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు, ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ వల్ల బాగా చదువుకోగలగుతున్నారు, మా ఇంట్లో మా నాన్నమ్మకు ఫించన్‌ వస్తుంది, మా చెల్లికి అమ్మ ఒడి రావడంతో తనను కూడా చదివిస్తున్నారు. పేద ముస్లింలకు ఇళ్ళ స్ధలాలు ఇస్తున్నారు, మా కుటుంబం చాలా పథకాల ద్వారా లబ్ధిపొందింది, ఈ పథకాలతో పేదలు చాలా సంతోషంగా ఉన్నారు, మీరే మళ్ళీ మళ్ళీ సీఎం అవ్వాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను, ధ్యాంక్యూ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *