జగనన్నే మా భవిష్యత్తు పేరుతో ప్రతి గడపకూ ప్రచారం 

తాడేప‌ల్లి: జగనన్నే మా భవిష్యత్తు పేరుతో ప్రతి గడపకూ ప్రచారం చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, ముఖ్య‌మ‌త్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూచించారు. మార్చి 18 నుంచి 26 వరకూ కూడా జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్ నిర్వ‌హించాల‌న్నారు. గడప, గడపకూ వైయస్ఆర్‌సీపీ సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు వెళ్లాల‌న్నారు. 5.65 లక్షల మంది సచివాలయ కన్వీనర్లు, గృహసారధులతో కూడిన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సైన్యం సిద్ధ‌మైంద‌ని చెప్పారు. వీరు 1.65 కోట్ల గృహాలు సంద‌ర్శించాల‌న్నారు . గడపగడపకూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం అత్యంత కీలకమ‌ని గుర్తు చేశారు. నిర్దేశించుకున్న విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాల‌ని ఆదేశించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు,  ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమావేశమ‌య్యారు.  ఈ సంద‌ర్భంగా పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్ దిశానిర్దేశం చేశారు. అలాగే రాబోయే రోజుల్లో పార్టీ పరంగా ప్రారంభించనున్న కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.

స‌మావేశంలోని ముఖ్యాంశాలు :
93 శాతం గృహసారథుల నియామకం పూర్తయ్యింది:
దాదాపు 5 లక్షల మంది గృహసారథులను నియమించుకున్నాం:
ఫిబ్రవరి 16 లోగా అక్కడక్కడా మిగిలిపోయిన నియామకాలను పూర్తిచేయాలి:
పార్టీకార్యక్రమాలు నిరంతరరాయంగా జరగాలంటే గృహసారథులనేవాళ్లు చాలా ముఖ్యమైనవారు:
గృహసారథులు, సచివాలయ కన్వీనర్ల మొదటి బ్యాచ్‌కు శిక్షణ కార్యక్రమాలు 387 మండలాల్లో ముగిశాయి.
రెండో బ్యాచ్‌కు శిక్షణ కార్యక్రమాలు మిగిలిన మండలాల్లో రేపటి నుంచి ప్రారంభమై, ఫిబ్రవరి19 వరకూ నడుస్తాయి.
మండలాల వారీగా జరిగే ఈ శిక్షణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలి.
ఈ శిక్షణ కార్యక్రమాలు ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి:
సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల రూపేణా వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి సుమారు 5.65 లక్షలమందితో క్షేత్రస్థాయిలో పార్టీ సైన్యం ఉంది:
వీరంతా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొంటారు.
దాదాపు 1.65 కోట్ల గృహాలను సందర్శిస్తారు:
మార్చి 18 నుంచి 26 వరకూ కూడా జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్‌ను పార్టీకి చెందిన సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు డోర్‌ టు డోర్‌ నిర్వహిస్తారు:
గత ప్రభుత్వం కన్నా.. ఈ ప్రభుత్వం అందించిన మెరుగైన పాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తారు :
గృహసారథులను కో–ఆర్డినేట్‌ చేసే బాధ్యతను సచివాలయ కన్వీనర్లకు అప్పగించాలి:

*గడప గడపకూ మన ప్రభుత్వంపైన కూడా ముఖ్యమంత్రి సమీక్ష.*
ఇప్పటివరకూ దాదాపు 7447 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం నిర్వహణ.
సగటున నెలలో సుమారు 6 సచివాలయాలను సందర్శించిన ఎమ్మెల్యేలు.

గడపగడపకూ కార్యక్రమం నిర్వహణ అత్యంత కీలకమని మరోసారి స్పష్టంచేసిన సీఎం.
నిర్దేశించుకున్న విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్న సీఎం.
ప్రతి ఇంట్లో ఉన్నవారిని కూడా పలకరించి వారితో కొంత సమయం గడపాలన్న సీఎం.
సుమారు 14 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి:
టీడీపీకి బాకా ఊదుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి వ్యక్తులతో యుద్ధం చేస్తున్నాం:
ఉన్నది లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా అవి చూపిస్తున్నాయి:
ప్రజలకు నిరంతరం ఏదో ఒక భ్రమ కల్పించే పనులు చేస్తున్నాయి:
వీటిని తిప్పికొడుతూ మనం ముందుకు సాగాలి:
గ్రాడ్యుయేట్లు, టీచర్లకు సంబంధించిన 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి: సీఎం
జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పరిశీలకులు వీరంతా కలిసికట్టుగా పనిచేయాలన్న సీఎం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *