Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలు, ప్రముఖ దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల్లో 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కాసేపట్లో క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాల వద్ద ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్ల ద్వారా టూరిస్టులకు భద్రత, సమాచారం అందించేలా చర్యలు తీసుకుంటారు. 24 గంటలూ పోలీస్ స్టేషన్లు పర్యాటకులకు, భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేక శిక్షణ తీసుకున్న వారు స్టేషన్లలో విధులు నిర్వర్తించనున్నారు.