Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కర్ణాటక కాగినెలె కనకదాసు గురుపీఠ పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ నిరంజనానందపురి మహాస్వామి, కర్ణాటక పురపాలక శాఖ మంత్రి ఎం.టి.బి.నాగరాజు, మాజీ మంత్రి హెచ్.ఎం.రేవణ్ణ, కర్ణాటక వెనుకబడిన కులాల ఫెడరేషన్ ప్రెసిడెంట్ బి.కే.రవి మర్యాదపూర్వకంగా కలిశారు.
తిరుమలలో కనకదాసు గురుపీఠం మఠం నిర్మించేందుకు అవసరమైన ఒక ఎకరా భూమిని కేటాయించాలని సీఎంకి విజ్ఞప్తి చేసిన పీఠాధిపతి, నాయకులు, సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి
తిరుమల క్ష్రేత్రంలో తమ కురబ సామాజిక వర్గానికి ఇప్పటి వరకు మఠం లేదని, లక్షలాదిమంది స్వామి వారి భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారని సీఎంకి వివరించిన పీఠాధిపతి, అంతేకాక శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కీర్తనలు, ప్రసస్ధ్యానికి తమ పీఠానికి ఉన్న చరిత్రను ముఖ్యమంత్రితో పంచుకున్న మహాస్వామి
ఈ సమావేశంలో పాల్గొన్న మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి.