Best Web Hosting Provider In India 2024
ఏం పాపం చేశాడని అజయ్‌కుమార్‌రెడ్డిపై దాడి చేశారు..?
మా పార్టీకి ఓటేసిన వారిపై దాడులు చేయించి శునకానందం పొందడం ఆపండి
నాయకులుగా ఉన్న మనలాంటివాళ్లం ఇలాంటివి ప్రోత్సహించకూడదు
దాడులు ఆపి ఇచ్చిన వాగ్దానాల అమలుపై దృష్టిపెట్టండి
ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు.. బాబు పాపాలు వేగంగా పండుతున్నాయి
బాబు వేస్తున్న ఈ చెడు బీజం రేపు టీడీపీ కార్యకర్తలకు చుట్టుకుంటుంది
చంద్రబాబుకు వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరిక
కడప: రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం చంద్రబాబు దగ్గరుండి మరీ దాడులు చేయిస్తున్నాడని, చంద్రబాబు వేసే ఈ బీజం, చేసే ఈ చెడు సంప్రదాయం అధికారం మారిన రోజున టీడీపీ కార్యకర్తలకు చుట్టుకుంటుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ఏం పాపం చేశాడని అజయ్‌కుమార్‌రెడ్డి అనే కుర్రాడిపై దాడి చేశారని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీకి ఓటు వేశాడని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి చెందినవాడని అతన్ని అతిదారుణంగా గాయపరిచి ఆస్పత్రిపాలు చేశారని మండిపడ్డారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అజయ్‌కుమార్‌రెడ్డిని వైయస్ జగన్ పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పారు. అజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు.
రిమ్స్ ఆవరణలో వైయస్ జగన్ ఏం మాట్లాడారంటే..
“ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీకి ఓటు వేశాడని, వైయస్ఆర్ సీపీ కుటుంబ సభ్యుడని అజయ్‌కుమార్‌రెడ్డి అనే యువకుడిని అతిదారుణంగా కొట్టారు. కావాలని వెహికిల్‌లో వేంపల్లె వచ్చి దారిలో వెళ్తున్న అజయ్ బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా దాడి చేసి ఆస్పత్రిపాలు చేశారు. ఈ దాడులతో ఏం సాధిస్తారు. ఇంత వరకు పులివెందులలో ఇలాంటి సంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికలు చూశాం. ఎప్పుడూ పులివెందులలో ఇలాంటి సంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తరువాత ఓటు వేయని వారిపై దాడి చేసే ఘటనలు ఎప్పుడూ లేవు. రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం దగ్గరుండి మరీ దాడులు చేయిస్తున్నారు. మీరు వేసే ఈ బీజం, చేసే ఈ చెడు సంప్రదాయం రేపు పొద్దున టీడీపీ కార్యకర్తలకు చుట్టుకుంటుంది.
వైయస్ఆర్ సీపీకి ఓటు వేసిన వారిపై దాడులు చేయించి భయాందోళనకు గురిచేసి శునకానందం పొందాలని చంద్రబాబు అనుకుంటున్నాడు. చంద్రబాబుకు మరోసారి చెబుతున్నా.. చెడు సంప్రదాయానికి నాంది పలుకుతున్నారు. దయచేసి ఈ దాడులు ఆపండి.. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. చంద్రబాబు పాపాలు శిశుపాలుడి పాపాలు పండినట్లుగా చాలా వేగంగా పండుతున్నాయి. అధికారం మారిన రోజున చంద్రబాబు చేస్తున్న ఈ చెడు సంప్రాదాయం తనకే చుట్టుకుంటుంది. ఈరోజున దెబ్బలు తిన్నవారంతా రేపు టీడీపీపై తిరిగబడేలా చంద్రబాబే బీజం వేసుకుంటున్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. నాయకులుగా ఉన్న మనలాంటివాళ్లం ఇలాంటివి ప్రోత్సహించకూడదు.
చంద్రబాబును మరోసారి హెచ్చరిస్తున్నా.. ఇది కరెక్ట్ సంప్రదాయం కాదు. ఇలాంటివి ఆపండి. అజయ్ కుమార్‌రెడ్డిని ఎందుకు కొట్టారు.. ఏం పాపం చేశారని ఆస్పత్రి పాలు చేశారు. మధ్యాహ్న భోజనం సరిగ్గా లేక ఇదే ఆస్పత్రిలో 90 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు. విద్యార్థులకు అందే మధ్యాహ్న భోజనం సరిగ్గా జరగడం లేదు. బ్యాగుల సప్లయ్ కూడా సరిగ్గా జరగడం లేదు. ఏ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయడం లేదు. దాడులు ఆపి వ్యవస్థను గాడిలో పెట్టండి. మా పార్టీకి రావాల్సిన 10 శాతం ఓట్లు చంద్రబాబు మోసపు వాగ్దానాల వల్ల కూటమికి పడ్డాయి.
రైతు భరోసా అందక రైతులు అల్లాడిపోతున్నారు. పిల్లల బడులు మొదలయ్యాయి కానీ, తల్లులకు అమ్మ ఒడి అందలేదు. అక్కచెల్లెమ్మలకు ఇస్తామన్న నెలకు రూ.1500 ఇచ్చే కార్యక్రమం చేయండి. ఇంటింటికి ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే రూ.3 వేల భృతి అన్నారు.. ఆ పిల్లలు ఎదురుచూస్తున్నారు వాటిని అమలు చేయండి. మంచి చేయకపోగా, రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనలు క్రియేట్ చేసే దుర్బుద్ధిని, దుశ్చర్యను ఆపండి అని మరోసారి చంద్రబాబును హెచ్చరిస్తున్నా. శిశుపాలుని పాపాలు పండినట్లుగా చంద్రబాబు పాపాలు వేగంగా పండుతున్నాయని మరిచిపోవద్దు“ అని వైయస్ జగన్ అన్నారు.