Best Web Hosting Provider In India 2024

అమరావతి: సొంత ఇల్లు అనేది పేదవాడి కల అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ల్యాబులను వినియోగించుకుని ఎప్పటికప్పుడు పరీక్షలను నిర్వహించి, పేదవాడికి అత్యంత నాణ్యమైన ఇంటిని అందించాలని ఆదేశించారు. పూర్తయిన ఇళ్లకు 15 రోజుల్లోగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని సూచించారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సీఎం వైయస్ జగన్కు వివరించారు. వర్షాలు తగ్గిన తర్వాత డిసెంబరు నుంచి ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని వివరించిన అధికారులు.