Radhika’s sister: అంబానీ గ్రహశాంతి పూజలో అందరి కళ్లు రాధిక మర్చంట్ అక్క మీదే.. తన ఫొటోలు, లుక్ వివరాలివే

Best Web Hosting Provider In India 2024

అంగరంగమైన వివాహం జరగడానికి సమయం దగ్గర పడుతోంది. జులై 12 వ తేదీన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జరగనుంది. పెళ్లికి సంబంధించిన వేడుకలు ఇప్పటికే మొదలైపోయాయి. అదరిపోయే సంగీత్ వేడుక తర్వాత ముంబయిలోని ఇంట్లో గ్రహశాంతి పూజను జరిపించారు. దీనికి సంబంధించిన చాలా ఫొటోలు ఇంటర్నెట్ లో వచ్చేశాయి. రాధిక సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేకంగా కనిపించారు. కానీ అందరి దృష్టి మాత్రం రాధిక మర్చంట్ అక్క అంజలి మర్చంట్ మీద పడింది. తన లుక్ తో అందరి మనసులు దోచేశారామె.

గ్రహశాంతి పూజ:

రాధిక తెలుపు రంగు చీరలో మెరిసిపోయారు. బంగారు రంగు బార్డర్ చీరతో హుందాగా కనిపించారు. దానికి జతగా గులాబీ రంగు బ్లవుజు వేసుకున్నారు. ముందు వైపు పల్లుతో చీర కట్టుకున్నారు. డైమండ్ నగలు, నుదుటన పాపిట బిల్ల, ముక్కు ముడక, చెవి కమ్మలు, అందమైన నెక్‌లేస్ తో మెరిసిపోయారు. ఐ ల్యాషెస్ కి మస్కారా, బుగ్గల మీద బ్లష్, న్యూడ్ లిప్ స్టిక్ రంగు తో మేకప్ వేసుకున్నారు. మధ్య పాపిట తీసి వెంట్రుకలు వదిలేసి హెయిర్ స్టైల్ పూర్తిచేశారు.

పటోలా చీరలో అంజలి మర్చంట్:

రాధిక మర్చంట్ అక్క అంజలి మర్చంట్ పటోలా చీరతో మరింత అందంగా కనిపించారు. గుజరాతీ స్టైల్ లో పటోలా చీర కట్టుకున్న ఆమెను అందరూ పొగడ్తలతో ముంచేస్తున్నారు సోషల్ మీడియాలో. ఆమె మెరూన్ రంగు చీర కట్టుకున్నారు. దానికి సీక్వెన్లున్న అంచు ఉంది. చక్కని చీరకట్టుకు జతగా, వర్క్ ఉన్న బ్లవుజుతో ప్రత్యేకంగా కనిపించారు.

తన లుక్ చూస్తే నగల మీద తనకున్న ఇష్టం తెలుస్తోంది. మెడలో తెలుపు రంగు చోకర్, పొడవాటి గుత్త పూసల నెక్‌లెస్ సెట్, చెవులకు పొడవాటి కమ్మలు, నుదుటిన వెడల్పాటి పాపిడ బిల్ల పెట్టుకున్న ఆమె రాణి లాగా కనిపించారు. మేకప్ కోసం న్యూడ్ ఐషాడో, వింగ్డ్ ఐ లైనర్, దిద్దిన కనుబొమ్మలు, బుగ్గల మీద బ్లష్, మెరుపు కోసం హైలైటర్, పెదాలకు గ్లాసీ పింక్ లిప్‌స్టిక్ తో లుక్ పూర్తి చేశారు. జుట్టును సిగలాగా కట్టుకున్నారు.

 

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024