Best Web Hosting Provider In India 2024
This Week OTT Movies: ఇప్పటికీ థియేటర్లలో కల్కి 2898 ఏడీ సినిమా అదరగొడుతోంది. బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల కలెక్షన్స్ వైపు దూసుకెళ్తోంది. ఇక ఈ వారం మరో అతిపెద్ద సినిమాగా కమల్ హాసన్ భారతీయుడు 2 జూలై 12న థియేటర్లలో సందడి చేయనుంది. అలాగే అదే రోజుల ఆకాశమే నీ హద్దురా హిందీ రీమేక్ సర్ఫిరా విడుదల కానుంది.
23 వరకు ఓటీటీ స్ట్రీమింగ్
ఇలా ఈ వారం థియేటర్లలో రెండు క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. అలాగే ఈ వారం అంటే జూలై 8 నుంచి 13 వరకు ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 23 వరకు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఎక్కువగా వెబ్ సిరీసులతోపాటు తెలుగు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. తమిళం, మలయాళంలో మంచి హిట్స్ సాధించిన మూవీస్ తెలుగులో డబ్ అయి ఈ వారమే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మరి అవెంటో, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ది బాయ్‌ఫ్రెండ్ (వెబ్ సిరీస్)- జూలై 9
రిసీవర్ (డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 10
ఎవర్ లాస్టింగ్ సీజన్ 2 (వెబ్ సిరీస్)- జూలై 10
వైల్డ్ వైల్డ్ పంజాబ్ (హిందీ చిత్రం)- జూలై 10
షుగర్ రష్: ది బేకింగ్ పాయింట్ సీజన్ 2 (టీవీ షో)- జూలై 10
అనెదర్ సెల్ఫ్ సీజన్ 2 (వెబ్ సిరీస్)- జూలై 11
వానిష్డ్ ఇంటూ ది నైట్ (హాలీవుడ్ సినిమా)- జూలై 11
వికింగ్స్: వాల్హల్ల 3 (వెబ్ సిరీస్)- జూలై 11
మహారాజా (తెలుగు డబ్బింగ్ తమిళ సినిమా)- జూలై 12
బ్లేమ్ ది గేమ్ (చిత్రం)- జూలై 12
ఎక్స్‌ప్లోడింగ్ కిట్టెన్స్ (కార్టూన్ వెబ్ సిరీస్)- జూలై 12
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
కమాండర్ కరణ్ సక్సేనా (హిందీ వెబ్ సిరీస్)- జూలై 8
మాస్టర్ మైండ్ (వెబ్ సిరీస్)- జూలై 10
అగ్నిసాక్షి (తెలుగు వెబ్ సిరీస్)- జూలై 12
షో టైమ్ (వెబ్ సిరీస్)- జూలై 12
ఆహా ఓటీటీ
హిట్ లిస్ట్ (తెలుగు డబ్బింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జూలై 9
ధూమం (తెలుగు డబ్బింగ్ మలయాళ సినిమా)- జూలై 11
సన్నీ (మూవీ)- యాపిల్ టీవీ ఓటీటీ- జూలై 10
సాసేజ్: పార్టీ ఫుడ్‌టోపియా (కార్టూన్ మూవీ)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- జూలై 11
36 డేస్ (హిందీ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- జూలై 12
పిల్ (హిందీ చిత్రం)- జియో సినిమా ఓటీటీ- జూలై 12
డాక్టర్ డెత్ సీజన్ 2 (వెబ్ సిరీస్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూలై 12
మందాకిని (మలయాళ సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జూలై 12
మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ
ఇలా ఈ వారం ఓటీటీలోకి మొత్తంగా 23 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన విజయ్ సేతుపతి మూవీ మహారాజా తెలుగులో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో జూలై 12 నుంచి డిజిటల్ ప్రీమియర్ కానుంది. అలాగే మరో తెలుగు డబ్బింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా హిట్ లిస్ట్ ఆహాలో జూలై 9 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
జూలై 12 నుంచి
ఇక మలయాళ పాపులర్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ డిఫరెంట్ మూవీ ధూమం సైతం ఆహా ఓటీటీలో జూలై 11 నుంచి ప్రసారం కానుంది. మలయాళంలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ కానుంది. ఇక వీటితోపాటు తెలగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అగ్ని సాక్షి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో.. మెడికో క్రైమ్ థ్రిల్లర్ హిందీ వెబ్ సిరీస్ పిల్ జియో సినిమాలో జూలై 12న ఓటీటీ రిలీజ్ కానున్నాయి.
తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
శ్రీయ సరన్, మౌనీ రాయ్ నటించిన షో టైమ్ వెబ్ సిరీస్ పూర్తి ఎపిసోడ్స్ హాట్‌స్టార్‌లో జూలై 12న తెలుగులో కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఇలా మూడు తెలుగు డబ్బింగ్ సినిమాలు, మూడు వెబ్ సిరీస్‌లు ఈ వారం ఓటీటీ స్పెషల్ కానున్నాయి. వీటిలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అగ్నిసాక్షి మరింత అట్రాక్షన్‌గా నిలవనుంది.