Best Web Hosting Provider In India 2024
Meenakshi Chaudhary: ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది మీనాక్షి చౌదరి. తెలుగులో ఐదు సినిమాలు చేస్తోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పీరియాడికల్ క్రైమ్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్నాడు.
బ్యాంక్ క్యాషియర్ కథ…
1980-90 ల కాలంలో సాధారణ బ్యాంక్ క్యాషియర్‌గా జీవితాన్ని మొదలుపెట్టిన భాస్కర్ కోటిశ్వరుడిగా ఎలా మారాడు అనే పాయింట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. పాన్ ఇండియన్ లెవెల్లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో లక్కీ భాస్కర్ రిలీజ్ అవుతోంది.
ముంబై సిటీ సెట్స్…
లక్కీ భాస్కర్ మూవీ కోసం 1980ల నాటి ముంబై నగరాన్ని తలపించేలా హైదరాబాద్‌లో భారీ సెట్లను మేకర్స్ సిద్ధం చేశారు. ఆ కాలం నాటి బ్యాంకులను పోలి ఉండే కోట్ల ఖర్చుతో సెట్లను తీర్చిదిద్దారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉండే పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో మీనాక్షి లుక్, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటాయని మేకర్స్ చెబుతోన్నారు.
దళపతి విజయ్ గోట్…
కాగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన మరో పాన్ ఇండియన్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ( గోట్) లక్కీ భాస్కర్ కంటే రెండు రోజుల ముందు రిలీజ్ కానుంది. దళపతి విజయ్ హీరోగా నటిస్తోన్న గోట్ మూవీని సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తోన్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ఆఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నారు. గోట్ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తోన్నాడు. ఈ సినిమాలో శ్రీనిధి అనే అమ్మాయిగా మీనాక్షి చౌదరి నటిస్తోంది.
గోట్ మూవీని తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకున్నది. గోట్ మూవీలో సీనియర్ హీరోహీరోయిన్లు ప్రశాంత్, ప్రభుదేవా, లైలా, స్నేహ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు.
చిరంజీవి విశ్వంభరలో…
ఒక్క రోజు గ్యాప్‌లో మీనాక్షి చౌదరి రెండు పాన్ ఇండియన్ సినిమాలు రిలీజ్ కావడం ఆసక్తికరంగా మారింది. లక్కీ భాస్కర్‌తో పాటు తెలుగులో మీనాక్షి చౌదరి ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరలో ఓ కీలక పాత్ర చేస్తోంది. త్రిష హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరితో పాటు మరో హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అలాగే వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీలలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది.