Moringa oil: మార్కెట్లో ఈ నూనె దొరికితే వదలొద్దు.. మునగ గింజల నూనెతో జుట్టుకు, వంటకు లాభాలు

Best Web Hosting Provider In India 2024

జుట్టు ఆరోగ్యం, ఎదుగుదల కోసం చాలా రకాల నూనెలు వాడుతుంటాం. మనం చాలా తక్కువగా విని, ఎక్కువగా ప్రయోజనాలున్న నూనె మాత్రం మునగ నూనె. జుట్టుకే కాదు చర్మం అందం కోసం కూడా మునగ నూనె వాడొచ్చు. దాని లాభాలు, ఉపయోగం గురించి వివరంగా తెల్సుకోండి.

మునగ నూనె అంటే?

మునగనూనె అనగానే మునగ ఆకుల నుంచి తయారు చేస్తారు అనుకుంటాం. కానీ, మునగ నూనెను మునగ గింజల నుంచి తయారు చేస్తారు. మునగ గింజల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. పోషకాలు ఎక్కువగా ఉంటాయి, ప్రొటీన్లుంటాయి. ఇది ఎసెన్షియల్ నూనె రూపంలో, వంట నూనె రూపంలో కూడా దొరుకుతుంది. చాలా రకాల చర్మ, ఇతర సౌందర్య ఉత్పత్తుల్లో దీన్ని వాడతారు. మునగ నూనెలో ఒలెయిక్ ఆమ్లం ఉంటుంది. ఇది మోనోశాచ్యురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన కొవ్వు. వంట కోసం వాడినప్పుడు మంచి పోషకాలు అందిస్తుంది. రోజూవారీ కూడా ఈ వంటనూనెను కొద్దిమొత్తంలో వాడటం మొదలుపెట్టి చూడొచ్చు. 

మునగ నూనె వాడకం:

మునగ ఎసెన్షియల్ నూనెను నేరుగా వాడకుండా ఏదైనా క్యారియర్ నూనెలో కలుపుకుని వాడాలి. బాదాం లేదా కొబ్బరి నూనె తో కలిపి జుట్టుకు, చర్మానికి రాసుకోవచ్చు. అలాగే వంట కోసం అయితే ఫుడ్ గ్రేడ్ నూనెను ఎంచుకోవాలి. ఇది లేత పసుపు రంగులో, కాస్త పల్లి నూనె వాసనతో ఉంటుంది. మునగ నూనె కొనేముందు లేబుల్ చూడటం మర్చిపోవద్దు. దానిమీద కోల్డ్ ప్రెస్డ్ లేదా ఆర్గానిక్ అని రాసి ఉండాలి. తినే రకమేనా లేదా కాస్మోటిక్స్ కోసం తయారు చేసిన నూనెనా అని నిర్ధారించుకోవాలి. మునగనూనెను చాలా రకాలుగా అమ్మడమే దానికి కారణం.

జుట్టు, చర్మం కోసం ఎలా వాడాలి? :

2 కప్పుల కొబ్బరి, బాదాం లేదా ఆలివ్ నూనె, ఏడెనిమిది చుక్కల మునగ నూనె, 5 చుక్కలు ఏదైనా ఎసెన్షియల్ నూనె (ల్యావెండర్ లేదా టీ ట్రీ నూనె) కలుపుకుని ఈ నూనెను వాడాలి. ఎసెన్షియల్ నూనె లేకపోయినా పర్వాలేదు కానీ మునగనూనెను నేరుగా క్యారియర్ అయిల్ లేకుండా వాడకూడదు. దాని గాఢత ఎక్కువగా ఉండటమే కారణం. 

దీన్నిజుట్టు కుదుళ్లకు, మాడుకు బాగా పట్టించి వలయాకారంలో మర్దనా చేయాలి. ఇదే నూనెను చర్మానికి కూడా రాసుకోవచ్చు. నూనెతో ముఖానికి చక్కగా మర్దనా చేసుకుని తర్వాత బాగా కడుక్కోవాలి. ఇది వాడే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకొని రాసుకోవడం మర్చిపోవద్దు.

1. ఈ నూనె చర్మానికి, జుట్టుకు కావాల్సిన తేమను అందిస్తుంది. దీంట్లో ఉండే ఒలేయిక్ ఆమ్లం మంచి క్లెన్సింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది.

2. మునగ వంట నూనెలో స్టిరాల్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయపడతాయి.

3. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉండటం వల్ల చర్మం మీద రాసుకున్నప్పుడు యాక్నె సమస్య తగ్గుతుంది.

 

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024