Best Web Hosting Provider In India 2024
Thalavan OTT బిజు మీనన్, ఆసీఫ్ అలీ హీరోలుగా నటించిన రీసెంట్ మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ తలవన్ ఓటీటీలోకి రాబోతోంది. క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మే నెలలో థియేటర్లలో రిలీజైంది. పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ థ్రిల్లర్ మూవీ 25 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
సోనీ లివ్ ఓటీటీ…
తలవన్ మూవీ సోనీ లివ్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సెప్టెంబర్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సోనీ లివ్ ప్రకటించింది. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.
ట్విస్ట్‌లు హైలైట్…
తలవన్ మూవీకి జిస్ జాయ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో మియా జార్జ్, అనుశ్రీ హీరోయిన్లుగా నటించారు. పోలీస్ ఆఫీసర్లుగా బిజు మీనన్, ఆసిఫ్ అలీ యాక్టింగ్‌తో పాటు కథ, ట్విస్ట్ బాగున్నాయంటూ తలవన్ మూవీపై ఆడియెన్స్ ప్రశంసలు కురిపించారు. ఓ పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు జిస్ జాయ్ ఈ మూవీని తెరకెక్కించాడు.
తలవన్ కథ ఇదే…
ఎస్ఐ కార్తిక్ వాసుదేవన్ (ఆసిఫ్ అలీ) ట్రాన్స్‌ఫర్‌పై సీఐ జయశంకర్ (బిజు మీనన్) పనిచేస్తోన్న పోలీస్ స్టేషన్‌కు వస్తాడు. కార్తిక్ దూకుడు మనస్తత్వం జయశంకర్‌కు నచ్చదు. ఓ కేసులో అరెస్ట్ అయిన మనుదాస్ అనే స్నేహితుడిని జయశంకర్ అనుమతి లేకుండా కార్తిక్ విడుదలచేస్తాడు. ఆ విషయంలో కార్తిక్‌తో జయశంకర్ గొడవపతాడు. జయశంకర్‌పై రివేంజ్ తీర్చుకునేందుకు ఎదురుచూస్తుంటాడు కార్తిక్.
ఈ గొడవ జరిగిన కొన్నాళ్ల తర్వాత జయశంకర్ ఇంటి టెర్రస్ పై రమ్య అనే యువతి డెడ్‌బాడీ దొరుకుతుంది. రమ్యతో జయశంకర్‌కు ఎఫైర్ ఉందనే పుకార్లు ఉండటంతో ఈ హత్య అతడే చేశాడని పోలీసులు అనుమానిస్తారు. అతడిని అరెస్ట్ చేస్తారు. అసలు రమ్యను ఎవరు హత్య ఎవరు? ఈ నేరంలో జయశంకర్ ఎలా చిక్కుకున్నాడు? ఈ మర్డర్ కేసును ఇన్వేస్టిగేషన్ చేసే బాధ్యతను కార్తిక్ చేపట్టడానికి కారణం ఏమిటి? అన్నదే ఈ మూవీ కథ.
పోలీస్ పాత్రలతో…
పోలీస్ పాత్రలతో మలయాళంలో బిజు మీనన్ చేసిన సినిమాలు అన్ని హిట్టయ్యాయి. అయ్యప్పనుమ్ కోషియమ్, తుండు, శివమ్, పాత్రమ్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేశాడు బిజుమీనన్. మలయాళంలో హీరోగా డిఫరెంట్ సినిమాలు చేస్తోన్న బిజు మీనన్ తెలుగులో ఓ రెండు సినిమాల్లో కనిపించాడు గోపీచంద్ రణంతో పాటు ర వితేజ ఖతర్నాక్ సినిమాల్లో విలన్‌గా నటించాడు.