Best Web Hosting Provider In India 2024
Shanmukha First Look: ప్రస్తుతం టాలీవుడ్లో డివోషనల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. భక్తి, పౌరాణిక కథాంశాలతో తెరకెక్కిన కల్కి, హనుమాన్తో పాటు పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఈ విజయాల స్ఫూర్తితో దర్శకనిర్మాతలు పౌరాణిక కథలపై ఎక్కువగా ఫోకస్ పెడుతోన్నారు. కెరీర్లో ఫస్ట్ టైమ్ డివోషనల్ జోనర్లో టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ ఓ సినిమా చేయబోతున్నాడు.
అవికా గోర్ హీరోయిన్…
డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు షణ్ముఖ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీలో ఆదిసాయికుమార్‌కు జోడీగా అవికాగోర్ హీరోయిన్గా నటిస్తోంది. షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నేపథ్యంలో ఈ మూవీ సాగనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు షణ్ముగం సాప్పాని దర్శకత్వం వహిస్తోన్నాడు.
ఫస్ట్ లుక్ రిలీజ్…
షణ్ముఖ మూవీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ ఇటీవల రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో ఆది సాయికుమార్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. అతడి వెనుక రకరకాల అవతారాలతో కొందరు వ్యక్తులు ఉన్నారు. వారితో పాటు షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి అవతారాన్ని చూపించడం ఆసక్తిని పంచుతోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో లంగా ఓణీ ధరించి ట్రెడిషనల్ లుక్‌లో అవికా గోర్ కనిపిస్తోంది.
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఆద్యంతం ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ సినిమా సాగుతుందని మేకర్స్ చెబుతోన్నారు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్‌గా ఆది సాయికుమార్ క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుందని అంటున్నారు. హై స్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌తో విజువల్ వండర్‌గా షణ్ముఖ సినిమాను తీర్చిదిద్దుతున్నామని డైరెక్టర్ అన్నాడు.
సలార్ ఫేమ్…
షణ్ముఖ సినిమాకు కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. అతడి బీజీఎమ్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉండబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసి పాన్ ఇండియన్ లెవెల్లో తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.
ఐదు సినిమాలు
సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా 2022 వరకు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ వచ్చాడు ఆది సాయికుమార్. గత ఏడాది నుంచి స్పీడు తగ్గించాడు. 2023లో ఆదిసాయికుమార్ నటించిన ఒకే ఒక మూవీ సీఐ సనాతన్ మాత్రమే రిలీజైంది. ప్రస్తుతం షణ్ముఖతో పాటు మరో నాలుగు నాలుగు సినిమాల్లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తోన్నాడు. ఆవికాగోర్ కూడా తెలుగులో సినిమాలు, సిరీస్‌లతో బిజీగా ఉంది. తెలుగులో గత ఏడాది మాన్షన్ 24, వధువు వెబ్‌సిరీస్‌లు చేసింది.