Best Web Hosting Provider In India 2024
ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో హిందీ వెబ్ సిరీస్‌లు వరుసగా వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్’ పేరుతో మరో వెబ్ సిరీస్ అడుగుపెడుతోంది. సూపర్ సక్సెస్ మీర్జాపూర్ సిరీస్ క్రియేటర్లలో ఒకరైన పునీత్ కృష్ణ ఈ సిరీస్‌కు పని చేశారు. క్రియేటర్‌గా ఉన్నారు. ‘త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్’ సిరీస్‌కు పునీత్‌తో పాటు అమిత్ రాజ్ గుప్తా మరో దర్శకుడిగా ఉన్నారు. నేడు (జూలై 9) ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ తీసుకొచ్చారు. స్ట్రీమింగ్ డేట్ కూడా రివీల్ అయింది.
ట్రైలర్ ఇలా..
‘త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్’ యాక్షన్, కామెడీ, బోల్డ్ కంటెంట్‌తో ఆసక్తికరంగా ఉంది. టాప్ సీఏగా ఉండే త్రిభువన్ మిశ్రా తన క్లయింట్లలో కొందరితో శృంగారపరమైన సంబంధాలు పెట్టుకుంటాడు. అయితే, ఓ గ్యాంగ్‌స్టర్ భార్యతో సంబంధం పెట్టుకొని దొరికిపోతాడు. దీంతో త్రిభువన్ను పట్టుకునేందుకు ఆ గ్యాంగ్‌స్టర్ వెంటపడతాడు. ఈ క్రమంలో కొన్ని యాక్షన్ సీన్లు ఉన్నాయి. త్రిభువన్ తప్పించుకొని తిరుగుతుంటాడు. ఇలా, సెక్స్, వైలెన్స్, డ్రామాతో ఈ సిరీస్ ట్రైలర్ ఉంది.
త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్ వెబ్ సిరీస్‌లో త్రిభువన్ మిశ్రాగా మానవ్ కౌల్ నటించారు. తిలోత్తమ షోమ్, శ్వేత బసు ప్రసాద్, శుభ్రజ్యోతి బారత్, ఫైజల్ మాలిక్, జితిన్ గులాటీ, అశోక్ పాఠక్, నైనా సరీన్, సుమీత్ గులాటీ, యామినీ దాస్ కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు పునీత్ కృష్ణ, అమిత్ రాజ్ గుప్తా దర్శకత్వం వహించారు. క్రియేటర్, షోరన్నర్‌గా పునీత్ ఉన్నారు.
త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్ వెబ్ సిరీస్‌ను రామ్ సంపత్, పునీక్ కృష్ణ, వినీత్ కృష్ణ నిర్మించారు. ఈ సిరీస్‌కు రామ్ సంపత్, అనురాగ్ సైకియా మ్యూజిక్ డైరెక్టర్లుగా ఉండగా.. అనూజ్ సంతానీ సినిమాటోగ్రఫీ చేశారు.
స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్
త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో జూలై 18వ తేదీన స్ట్రీమింగ్కు రానుంది. ట్రైలర్‌తో పాటే ఈ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ కన్ఫర్మ్ చేసింది. వచ్చే వారమే ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవనుంది.
ఇటీవలే మీర్జాపూర్ మూడో సీజన్
పునీత్ కృష్ణ, కరణ్ ఆయుష్మాన్ క్రియేటర్లుగా ఉన్న సక్సెస్ఫుల్ మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో మూడో సీజన్ గత వారమే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకులుగా ఉన్నారు. రెండు సీజన్లు విజయవంతం కాగా.. ఫుల్ హైప్ మధ్య మీర్జాపూర్ మూడో సీజన్ వచ్చింది. రెండో సీజన్ వచ్చిన సుమారు నాలుగేళ్లకి ఈ మూడో సీజన్ అడుగుపెట్టింది. ఈ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, రసిక దుగల్, శ్వేత త్రిపాఠి మొహంతీ, ఇషా తల్వార్, విజయ్ వర్మ, అంజుమ్ శర్మ మెయిన్ రోల్స్ చేశారు. మీర్జాపూర్ మూడో సీజన్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మీర్జాపూర్ సిరీస్ చూడొచ్చు. ఈ మూడో సీజన్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.