Best Web Hosting Provider In India 2024
Rose Milk: రోజ్ మిల్క్ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది రాజమండ్రి. ఇది రాజమండ్రి రోజ్ మిల్క్‌గా ఎంతో ప్రాచుర్యం పొందింది. అక్కడ రకరకాల రోజ్ మిల్క్‌లను తయారు చేస్తారు. రోజ్ మిల్క్ కోసం ముందుగా రోజ్ సిరప్‌ను తయారు చేసుకోవాలి. దాంతోనే రోజ్ మిల్క్‌ను తయారు చేస్తారు. ఇది స్వీట్ గా చాలా టేస్టీగా ఉంటుంది. వాసన చూస్తే ఘుమఘుమలాడిపోతుంది. దీన్ని అరగంటలో వండేయచ్చు.
రోజ్ మిల్క్ రెసిపీకి కావలసిన పదార్థాలు
గులాబీ రేకులు – రెండు కప్పులు
నీరు – ఆరు కప్పులు
చక్కెర – నాలుగు కప్పులు
బీట్రూట్ రసం – రెండు స్పూన్లు
పాలు – ఒక కప్పు
బాదం పప్పులు – ఐదు
మీగడ – రెండు స్పూన్లు
రోజ్ మిల్క్ రెసిపీ
1. రోజ్ మిల్క్ రెడీ చేసేందుకు ముందుగా రోజు సిరప్‌ను తయారు చేయాలి.
2. ఇందుకోసం గులాబీ రేకులను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
3. వాటిని ముందు రోజు రాత్రి నీటిలో వేసి నానబెట్టాలి.
4. మరుసటి రోజు ఉదయం వరకు వాటిని అలాగే ఉంచాలి. తర్వాత రోజ్ వాటర్లో బీట్రూట్ రసం వేస్తే మంచి రంగును పొందుతుంది.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పంచదార వేయాలి.
6. ఆ పంచదారలో గులాబీ రేకుల నీటిని కూడా వేసి చిన్న మంట మీద మరిగించుకోవాలి.
7. పంచదార గులాబీ రేకుల నీళ్లు కలిసి పాకంలాగా అవుతాయి.
8. అంతవరకు వాటిని మరిగించుకొని చల్లబరచాలి.
9. తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టి ఒక సీసాలో వేసి ఫ్రిజ్లో నిల్వ ఉంచుకోవాలి. అదే రోజ్ సిరప్.
10. రోజ్ మిల్క్ తాగాలనిపించినప్పుడల్లా ఆ రోజ్ సిరప్‌ను ఉపయోగించాలి.
11. ఇప్పుడు రోజ్ మిల్క్ చేయడానికి ముందుగానే పాలను మరగపెట్టి గది ఉష్ణోగ్రతకు వచ్చే వరకు చల్లార్చాలి.
12. పాలను డీఫ్రిడ్జ్ లో పెట్టి కాస్త గట్టిపడేలా చేయాలి.
13. తర్వాత వాటిని తీసి మిక్సీలో వేసి రబ్బుకోవాలి.
14. దాన్ని ఒక గ్లాసులోకి వేయాలి. ఈ మిశ్రమం చిక్కగా వస్తాయి.
15. అందులోనే మూడు టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్ వేయాలి.
16. అలాగే బాదం పప్పులను ముందుగానే పేస్ట్ చేసుకొని ఆ క్రీమును కూడా వేయాలి. అంతే టేస్టీ రోజ్ మిల్క్ రెడీ అయినట్టే.
17. ఇది మంచి వాసనతో ఘమఘమలాడిపోతుంది. తాగే కొద్ది మరింతగా తాగాలనిపిస్తుంది. ఒక్కసారి మీరు చేసుకొని చూడండి మీకు నచ్చడం ఖాయం.
రోజ్ సిరప్‌లో సోంపు లేదా లవంగాన్ని వేసినా రుచి అదిరిపోతుంది. అలాగే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. మీకు బాదం పేస్టు వేయాలనుకుంటే వేసుకోండి, లేదా క్రీమ్ కూడా వేసుకోవచ్చు. వెనిల్లా, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్‌లను ఒక స్కూప్ రోజ్ మిల్క్ పై వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. లేదా డ్రై ఫ్రూట్స్ తరుగును చల్లుకొని తిన్నా రుచిగా ఉంటాయి.