Best Web Hosting Provider In India 2024
AP POLYCET 2024 Final Phase Notification: ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఆయా కాలేజీల్లో ప్రవేశాల కోసం ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ బి నవ్య పేర్కొన్నారు.
ఏపీ పాలిసెట్ ఎంట్రెన్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులు తుది దశ కౌన్సెలింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జులై 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఫీజు పేమెంట్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన అభ్యర్థులకు ఇవే తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. జులై 11వ తేదీ నుంచి జులై 14వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జులై 16వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 18వ తేదీ నుంచి 20 తేదీల మధ్య కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ఏపీ పాలిసెట్ తుది దశ కౌన్సెలింగ్ – ముఖ్య తేదీలు
- ఆన్‌లైన్ పద్ధతిలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు – జులై 11 – జులై 13, 2024.
- ధ్రువపత్రాల పరిశీలన – జులై 11 – జులై 13, 2024.
- వెబ్ ఆప్షన్లు – జులై 11 – జులై 14, 2024.
- సీట్ల కేటాయింపు – జులై 16, 2024.
- కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సిన తేదీలు – జులై 18 -20, 2024.
తుది దశ కౌన్సెలింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు https://appolycet.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. ఇప్పటికే ఏపీ పాలిసెట్ తరగతులు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
2024-25 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ నిర్వహించారు. మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ నిర్వహించారు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్ధులకు ఉన్నత విద్యా మండలి ప్రవేశపరీక్షకు హాజరయ్యేందుకు ఉచిత శిక్షణ కూడా అందించింది.
ఏపీలో పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,42,035 మంది విద్యార్ధులు ప్రవేశ పరీక్షకు హాజరుకాగా, 87.61 శాతం మేర 1,24,430 మంది అర్హత పొందారు. వీరిలో బాలికలు 56,464 మంది పరీక్షకు హాజరుకాగా, 89.81 శాతం మంది, బాలురలో 85,561 మంది హాజరుకాగా 86.16 శాతం అర్హత పొందారు.
ఏపీ పాలిసెట్ 2024 కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఫీజు చెల్లించిన రశీదు, హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, పదో తరగతి ఉత్తీర్ణత ధృవపత్రం, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, అర్హులైన వారికి ఈడబ్ల్యుఎస్ ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, ప్రత్యేక క్యాటగిరీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
How to Check AP POLYCET 2024 Result – ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
- ఏపీ పాలిసెట్ పరీక్ష రాసిన విద్యార్థులు https://apsbtet.ap.gov.in లేదా https://polycetap.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే ‘AP POLYCET 2024 Result’ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మీ ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
- అడ్మిషన్ల ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.
సంబంధిత కథనం
టాపిక్