Best Web Hosting Provider In India 2024
Prabhas Kalki OTT Release: సాధారణంగా స్టార్ హీరో సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి నలుగురైదుగురు అగ్ర తారలు, వారితోపాటు సెన్సేషనల్ డైరెక్టర్స్‌తో కెమియో రోల్స్ ఉన్న సినిమాకు ఇంకెలాంటి డిమాండ్ ఉంటుంది. అలాంటి సినిమానే కల్కి 2898 ఏడీ.
తొలి రోజు నుంచే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, హాట్ బ్యూటి దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా కల్కి 2898 ఏడీ. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. మూవీ రిలీజైన తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతోంది.
వెయ్యి కోట్లవైపుగా
ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా రూ. 900 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించి వెయ్యి కోట్ల మార్క్ చేరుకునేందుకు రెడీగా ఉంది కల్కి 2898 ఏడీ సినిమా. ఇదిలా ఉంటే, ప్రస్తుతం కల్కి 2898 ఏడీ ఓటీటీ రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయంపై ఇండియన్ ఆడియెన్స్‌కు విపరీతమైన క్యూరియాసిటీ కలుగుతోంది.
2 ఓటీటీల్లో కల్కి
అయితే, కల్కి సినిమా ఓటీటీలోకి ఇప్పట్లో రాదని చాలమందికి తెలిసిన విషయమైన ఓటీటీ ప్లాట్‌ఫామ్, డిజిటల్ ప్రీమియర్ డేట్ ఎప్పుడనే విషయాలు తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆతృతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కల్కి 2898 ఏడీ ఓటీటీ రిలీజ్‌కి సంబంధించిన ఓ విషయం చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ కల్కి సినిమా ఏకంగా రెండు ఓటీటీల్లోకి రానుందని సమాచారం.
నెట్‌ఫ్లిక్స్‌కు హిందీ రైట్స్
కల్కి 2898 ఏడీ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ సంస్థలు కొనుగోలు చేశాయని తెలుస్తోంది. అందుకు నిర్మాతలకు సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ యాజమాన్యం భారీగానే ముట్టజెప్పిందని టాక్. అయితే, దక్షిణాది భాషల అంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్, హిందీ భాష రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నారట.
ఆ డేట్ నుంచే స్ట్రీమింగ్
అంటే, అమెజాన్ ప్రైమ్‌లో కల్కి సినిమాను తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తే.. నెట్‌ఫ్లిక్స్‌లో నార్త్ ఆడియెన్స్ కోసం అందుబాటులో ఉండనుంది. ఇక కల్కిని థియేట్రికల్ రిలీజ్‌కు 7 లేదా 8 వారాల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. అంతేకాకుండా ఆగస్ట్ 15న కల్కిని డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారని తాజాగా వైరల్ అవుతోన్న సమాచారం.
థియేటర్లలో చూసినప్పటికీ
అంటే, ఇండిపెండెన్స్ ఫెస్ట్ సందర్భంగా కల్కిని ఓటీటీలో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. దీనిలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ కల్కి సినిమాను థియేటర్లలో చూసినప్పటికీ ఓటీటీల్లో చూసేందుకు ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఉవ్విలూరుతున్నారు. అయితే, కల్కి ఓటీటీ స్ట్రీమింగ్‌కి కొన్ని రోజుల ముందు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
అదిరిపోయిన యాక్షన్ సీక్వెన్స్
ఇదిలా ఉంటే, మహాభారతంలోని కొన్ని అంశాలను స్ఫూర్తిగా తీసుకుని కల్కి 2898 ఏడీ సినిమాను తెరకెక్కించారు నాగ్ అశ్విన్. ఇందులో అశ్వత్థామ పాత్రలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటన అత్యద్భుతంగా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. సినిమాలో అమితాబ్ బచ్చన్, ప్రభాస్ మధ్య వచ్చిన యాక్షన్ సీక్వెన్స్‌కు మంచి అప్లాజ్ వస్తోంది.