Best Web Hosting Provider In India 2024
Kalki 2898 AD Box Office Collection: దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 3డీ సైన్స్ ఫిక్షన్ ‘కల్కి 2898 ఏడీ‘ విడుదలైన 13వ రోజు ఇండియాలో దాదాపు రూ.9 కోట్ల నెట్ వసూలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఇది 12వ రోజుతో (రూ. 10.4 కోట్లు) పోలిస్తే తక్కువే అని చెప్పొచ్చు.
హిందీలోనే ఎక్కువగా
ఇక కల్కి సినిమాకు 13వ రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.51 కోట్లు రాగా తెలుగు భాషలో రూ. 2 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. అలాగే హిందీ నుంచి రూ. 5.6 కోట్లు, తమిళం నుంచి ఆరు లక్షలు, కన్నడ నుంచి 15 లక్షలు, మలయాళం నుంచి రూ. 45 లక్షలు వసూలు అయ్యాయి. వీటిని గమనిస్తే.. 13వ రోజు తెలుగు కంటే హిందీ భాషలోనే కలెక్షన్స్ ఎక్కువగా వచ్చాయి.
ఏరియాలా వారీగా కలెక్షన్స్
అలాగే 13వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. కల్కి సినిమాకు 13 రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 166.10 కోట్లు రాగా.. కర్ణాటక నుంచి రూ. 30.10 కోట్లు, తమిళనాడు నుంచి 19 కోట్లు కేరళ నుంచి 10.10 కోట్లు, హిందీతోపాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 115.60 కోట్లు, ఓవర్సీస్ నుంచి 109.50 కోట్లు కలెక్ట్ అయ్యాయి.
కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఇక కల్కి సినిమాకు భారత్‌లో మొత్తం రూ. 529.45 కోట్ల వసూళ్లు వచ్చాయి. అలాగే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయానికొస్తే పలు నివేదికల ప్రకారం ఈ సినిమాకు 450.40 కోట్ల షేర్ కలెక్షన్స్, రూ. 871.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ, ఈ సినిమా మేకర్స్ సోషల్ మీడియాలో ‘ఎపిక్ మహా బ్లాక్బస్టర్ కల్కి 2898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లు కలెక్ట్ చేసింది’ అని రాసుకొచ్చారు.
నిర్మాతలకు లాభాలు
‘మ్యాజిక్ మైలురాయి దిశగా దూసుకెళ్తున్నా.. సినిమాల్లో #EpicBlockbusterKalki’ అనే క్యాప్షన్‌తో ఈ పోస్ట్ చేశారు. ఏది ఏమైనా కల్కి 2898 ఏడీ సినిమా రూ. 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగి దాన్ని సాధించింది. అలాగే ఇప్పటివరకు సినిమా నిర్మాతలకు రూ. 78.40 కోట్ల లాభాలు వచ్చాయి. దీంతో చూస్తే కల్కి సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.
14వ రోజు కోటి రూపాయలు
ఇదిలా ఉంటే, కల్కి 2898 ఏడీ సినిమా 14వ రోజున అంటే ఇవాళ సుమారు కోటి రూపాయల వరకు నెట్ ఇండియా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేశారు. కాగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, ప్రభాస్ ప్రధాన తారాగణంగా 600 కోట్ల బడ్జెట్‌తోత తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్లతో పర్వాలేదనిపిస్తోంది.
Best Web Hosting Provider In India 2024
Source / Credits