Best Web Hosting Provider In India 2024
ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సంస్థ ఎండీ సజ్జనార్ కీలక అలర్ట్ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో 3,035 కొలువుల భర్తీకి సంబంధించిన కసరత్తును TGSRTC ప్రారంభించిందని సజ్జనార్ తెలిపారు. “3035 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని, ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింక్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉద్యోగార్థుల అర్హతలు, దరఖాస్తు ఫీజు, తదితర వివరాలను అందులో పేర్కొన్నారు. అవన్నీ ఫేక్. ఆ లింక్ లను ఉద్యోగార్థులు నమ్మవద్దు. క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేయవద్దు” అని ఓ ప్రకటనలో కోరారు.
టాపిక్
TsrtcTelangana NewsJobs