Best Web Hosting Provider In India 2024
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో అపర్ణ రెడీ అవుతుంటుంది. ఇంతలో పనిమనిషి వచ్చి పిలిచారంటా అని అడుగుతుంది. ఆ మాటలను చాటుకు ఉండి వింటూ ఉంటుంది రుద్రాణి. సుభాష్ ఇచ్చిన చీరతోపాటు కొంత డబ్బు పెట్టి పనిమనిషికి ఇస్తుంది అపర్ణ. ఇంత ఖరీదైన చీర నాకెందుకు అమ్మా అని పనిమనిషి అంటుంది.
హాల్లో బోర్డ్స్
ఏ ఇవ్వకూడదా.. ఖరీదైన చీర కట్టుకోవాలని నీకూడ ఉంటుంది కదా. ఇవాళ మా పెళ్లి రోజు. తీసుకో అని పనిమనిషికి భర్త ఇచ్చిన చీర ఇచ్చేస్తుంది అపర్ణ. పనిమనిషి వెళ్లగానే.. నా మనసు మారదు. నిన్ను క్షమించేదే లేదు అని అపర్ణ మనసులో అనుకుంటుంది. అదంతా చూసిన రుద్రాణి ఇవాళ ఏదో జరగబోతుంది అని అనుకుంటుంది. కట్ చేస్తే హాల్లో అంతా ఉంటారు. బోర్డ్స్ ఉండటం చూసి ఏంట్రా ఇదంతా అని ప్రకాశం అడుగుతాడు.
రాహుల్, రుద్రాణి ఎలా ఉండాలో రూల్స్ ఏమైనా రాయబోతున్నారా అని ప్రకాశం అంటాడు. ఫూల్స్ రూల్స్ లెక్క చేస్తారా అంకుల్. మన పిచ్చిగాకపోతే. ఊళ్లో పశువులకు మూడు పూటల పచ్చి గడ్డి ఎండు గడ్డి వేస్తే గానీ ఈ జీవాలు మారవు అని స్వప్న అంటుంది. వెంటనే సుభాష్, అపర్ణ పెళ్లి రోజు అని రాజ్ కావ్య చెబుతారు. దాంతో అంతా కంగ్రాట్స్ చెబుతారు. అబ్బో అన్నయ్య వదినా మొహాలు వెలిగిపోతున్నాయే. జరిగిందంతా మర్చిపోయి త్వరగానే కలిసిపోయారే అని రుద్రాణి అంటుంది.
నీ మనసు నాకు తెలుసు
అందరూ మీలా విడిపోయి పుట్టింట్లో ఉంటారా వెటకారం కాకపోతే అని స్వప్న కౌంటర్ ఇస్తుంది. ఇది వెటకారం కాదు మమకారం నీకు అర్థం కాదు కానీ రుద్రాణి అంటుంది. కల్యాణ్ ఒక్కడే లేడని ధాన్యలక్ష్మీ అంటే.. ఇక్కడే ఉన్నాను అంటూ వచ్చిన కల్యాణ్ తెలుగులో శుభాకాంక్షలు చెబుతాడు. తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కాబట్టి.. నీ మనసు నాకు తెలుసు ఈ రౌండ్ పేరు అని గేమ్ స్టార్ట్ చేస్తాడు రాజ్.
కల్యాణ్ హోస్ట్ చేస్తాడు. అమ్మమ్మ తాతయ్య జడ్జ్‌లుగా ఉండి బెస్ట్ కపుల్ ఎవరో చెబుతారని కావ్య అంటుంది. మూకాభినయం అంటే ఒక పదాన్ని గానీ, సినిమా పేరు గానీ సైగలతో చేసి చూపిస్తే వేరేవాళ్లు అదేంటో చెప్పాలి అని కల్యాణ్ అంటాడు. తర్వాత భార్యాభర్తల బంధం, ప్రేమ గురించి గొప్పగా చెబుతారు ఇందిరాదేవి, సీతారామయ్య. అంటే తల్లి ప్రేమ కంటే భార్య ప్రేమ గొప్పదా అని రాజ్ అడుగుతాడు. అలా చూస్తే తల్లి ప్రేమే గొప్పది కానీ, పెళ్లి తర్వాత ఎక్కువ సంవత్సరాలు కాపురం చేయాల్సింది భార్యతోనే కదా అని ఇందిరాదేవి అంటుంది.
నిన్నే ప్రేమిస్తా
పిల్లలపై తల్లికి ప్రేమ ఉంటుంది. కానీ, పెళ్లయ్యకా భర్త, పిల్లలు, అత్తిల్లు ఇలా గడుస్తుంది. చివరికీ తనతో ఉండేది భర్త మాత్రమే అని ఇందిరాదేవి చెబుతుంది. తర్వాత గేమ్ స్టార్ట్ చేస్తారు. ముందు ఒప్పుకోని అపర్ణ తర్వాత ఒప్పుకుంటుంది. అమ్మమ్మ చెవిలో చెప్పినదాన్ని మీరు సైగలతో చేసి చెప్పాలి అని కల్యాణ్ అంటే.. ఇందిరాదేవి దగ్గరికి అపర్ణ వెళ్తుంది. చెవిలో నిన్నే ప్రేమిస్తా అని ఇందిరాదేవి చెబుతుంది. దాన్ని సైగలతో అపర్ణ చేస్తే.. చాలా పేర్లు చెప్పాకా కరెక్ట్‌గా చెబుతాడు సుభాష్.
తర్వాత ప్రకాశం ధాన్యలక్షీ ఆడి ఓడిపోతారు. తర్వాత రాహుల్ స్వప్న కూడా ఆడి ఓడిపోతారు. తర్వాత ఈ ఇంటి రారాజు రాజ్, యువరాణి కావ్య ఆడుతారని ఇందిరాదేవి అంటుంది. వీడు రారాజు రాజ్ అయితే.. నా కొడుకు ఏంటీ రంగురాళ్లు అమ్ముకునే వాడా అని రుద్రాణి మనసులో అనుకుంటుంది. కావ్య ఇందిరాదేవి దగ్గరికి వెళ్తే.. ఊహలు గుసగుసలాడే అని చెబుతుంది. దాన్ని సైగలతో రాజ్‌కు చేసి చూపిస్తుంది కావ్య. రాజ్‌కు అర్థం కాదు. ఇక్కడ కాసేపు గొడవపడతారు.
కొట్టుకోడానికై సరిపోయింది
ఇంతలో టైమ్ అయిపోయిందని ఇందిరాదేవి చెబుతుంది. టైమంతా మీరు కొట్టుకోడానికే అయిపోయింది. ఇంకేం గెలుస్తారు అని ఇందిరాదేవి అంటుంది. కరెక్ట్‌గా చెప్పి భార్య మనసు సరిగ్గా అర్థం చేసుకుంది మన సుభాష్. గెలిచింది వీళ్లే అని సీతారామయ్య అంటాడు. అంతా చప్పట్లు కొడతాడు. తర్వాత కల్యాణ్ తన భార్య లేదని నిరాశపడతాడు. తర్వాతి రౌండ్ మొదలుపెట్టమని రాజ్ అంటే.. నేను కాసేపు కూర్చుంటాను అని కల్యాణ్ కూర్చుంటాడు.
ఇప్పుడు సెకండ్ రౌండ్.. మీ టేస్ట్ నాకు తెలుసు అని రాజ్ కావ్య చెబుతారు. ఈ రౌండ్‌లో భార్యభర్తల కళ్లకు గంతలు కట్టి ఒకరికి సంబంధించిన ప్రశ్న మరొకరిని అడుగుతాం. దాన్ని అందరికి కనిపించేలా బోర్డ్ మీద రాయాలి. అర్థమైందా అని కావ్య అంటుంది. అర్థమైందని రుద్రాణి అంటే.. ఏం అర్థమైంది. మీరు ఎవరిది చెబుతారు అని స్వప్న అంటుంది. ఏయ్.. అది అందరికీ తెలిసిందే కదా అని రాహుల్ అంటాడు. ముందుగా డాడ్ మామ్ అని రాజ్ అంటే సుభాష్ నేను రెడీనే అంటాడు.
నేను నచ్చానా
దాంతో సుభాష్ వైపు అసహ్యంగా చూస్తుంది అపర్ణ. అది అంతా చూసి షాక్ అవుతారు. ఏంటీ అలా చూస్తున్నారు. నేను కూడా రెడీనే అని సిగ్గు పడినట్లుగా అంటుంది అపర్ణ. మొదటిసారి మీ పెళ్లి చూపుల్లో డాడ్ మీతో మాట్లాడింది ఏంటో మామ్ నువ్ రాయాలి. అది డాడ్ గెస్ చేస్తారు అని రాజ్ అంటాడు. నేను నచ్చానా అని అపర్ణ రాస్తుంది. అమ్మ రాసింది ఏం మాట్లాడావో చెప్పు అని సుభాష్‌ను అడుగుతాడు రాజ్. నేను నచ్చానా అని అడిగాను అని సుభాష్ కరెక్ట్‌గా చెబుతాడు. దాంతో అంతా చప్పట్లు కొడతారు.
తర్వాత మీరు మొదటిసారి ఎదురుపడ్డప్పుడు ఏ కలర్ షర్ట్ వేసుకున్నారు అని, డాడ్ రాస్తారు, అమ్మ నువ్ చెప్పాలి అని రాజ్ అంటాడు. వైట్ కలర్ అని సుభాష్ రాస్తాడు. డాడ్ ఏ కలర్ షర్ట్ వేసుకున్నారో చెప్పాలని అపర్ణను రాజ్ అడుగుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో కపుల్స్ డ్యాన్స్ చేస్తారు. కేక్ కటింగ్ చేస్తుండగా.. సుభాష్ గిఫ్ట్‌గా ఇచ్చిన చీరను పనిమనిషి కట్టుకుని వస్తుంది. అది చూసి సుభాష్, కావ్య, రాజ్ షాక్ అవుతారు.
షాక్ ఇచ్చిన అపర్ణ
ఏంటిది.. ఇంత ఖరీదైనా చీర నీకు ఎక్కడిది. ఇది పదివేలకు తక్కువ ఉండదే అని రుద్రాణి అనుమానంగా అడుగుతుంది. ఇవాళ వాళ్ల పేరు రోజు అని అమ్మగారు ఈ చీర పెట్టి డబ్బులు కూడా ఇచ్చారని పనిమనిషి చెబుతుంది. అలా అపర్ణ ఇచ్చిన షాక్‌కు సుభాష్, రాజ్, కావ్య అవాక్కైపోతారు.