Karthika deepam 2 serial: కార్తీక్ కోసం వెళ్లిపోతానన్న శౌర్య.. నరసింహ చొక్కా పట్టుకుని దుమ్ము దులిపేసిన దీప

Best Web Hosting Provider In India 2024

Karthika deepam 2 serial today july 11th episode: దీప రోడ్డు మీద కార్తీక్ కి కనిపిస్తుంది. ఇంటికి రమ్మని అడుగుతాడు. నరసింహ జీవితంలో రౌడీ జోలికి రాకుండా ఉండటం కోసం పాప నా కూతురు అని చెప్పాను. వాడి నుంచి విముక్తి దొరుకుతుందని అనుకున్నాను కానీ మీరు మళ్ళీ శౌర్యను కష్టాలలోకి తీసుకెళ్తారని అనుకోలేదని చెప్తాడు. దీప మాత్రం అసలు ఒప్పుకోదు. శౌర్య గురించి ఆలోచించిన వాళ్ళు నా గురించి ఎందుకు ఆలోచించలేదు.

 

నేను వాళ్ళ ముందు తలెత్తుకుని తిరగలేను 

శౌర్యను మీరు నా కూతురు అంటే నా భర్త దృష్టిలో నేను మీకు ఏమవుతాను. సమాజం నాకు ఏ పేరు పెడుతుంది. మీరు శౌర్య గురించి ఆలోచించేటప్పుడు నా గురించి కూడా ఆలోచించి ఉంటే ఇలా దొంగలా పారిపోయి వచ్చేదాన్ని కాదు. ఇది నాకు అవసరమా అని అంటుంది.

ఇంటి దగ్గర అందరూ మీకోసం ఎదురుచూస్తున్నారని అంటే నేను వాళ్ళ ముందు తలెత్తుకుని తిరగలేనని చెప్తుంది. నేను వాళ్ళకు సమాధానం చెప్తానని అంటే అప్పుడు ఇద్దరి మొహాన ఛీ అంటారు. మీరు చెప్పిన మాట ఎలా ఉన్నా అది విన్న వాళ్ళకు ఇలాగే అనిపిస్తుంది.

అందుకే ముందే నేను వచ్చేశాను. నేను కనిపించానని ఎవరికీ చెప్పొద్దు అంటుంది. కార్తీక్ బాధగా రౌడీ ఎలా ఉంది దాన్ని చూడాలని ఉందని అడుగుతాడు. దీప మాత్రం కోపంగా వెళ్లిపొమ్మని చెప్తుంది. నా వెనుకే వచ్చి ఇల్లు తెలుసుకుని సుమిత్ర గారిని తీసుకొస్తే అసలు ఈ ఊర్లోనే ఉండను మీకు కనిపించను అనేసి వెళ్ళిపోతుంది.

దీప కోసం అల్లాడిపోతున్న సుమిత్ర 

తప్పు చేసినట్టు ఉన్నాను దీప ఇప్పుడు నేనేం చేయాలని కార్తీక్ బాధపడతాడు. సుమిత్ర అవుట్ హౌస్ వైపు చూసి దీప పరిచయం అయిన సంఘటన గుర్తు చేసుకుని ఏడుస్తుంది. దశరథ వచ్చి ఓదారుస్తాడు. నా కూతురు నా ఇంట్లోనే ఉంది కానీ దీప కనిపించడం లేదంటే నా కన్న కూతురు కనిపించనట్టే ఉందని అంటుంది.

 

దీప అత్త దగ్గరకు వెళ్లలేదు, హోటల్ కి వెళ్లలేదు. మనం కాక ఇక్కడ ఎవరు తెలుసు. దీప గురించి బాధపడకు. రేపు పంతులిని ఇంటికి పిలిపించాను. పిల్లల జాతకాలు చూసి ముహూర్తాలు పెట్టిస్తున్నానని చెప్తాడు. కానీ సుమిత్ర మాత్రం వద్దు మనమే గుడికి వెళ్ళి శాంతి పూజ చేయిద్దామని చెప్తుంది.

కార్తీక్ ని చూడాలనిపిస్తుంది 

దీప ఇడ్లీలు వండి సైకిల్ మీద వెళ్ళి అమ్మబోతున్నానని శౌర్యకు చెప్తుంది. అయితే నీతో పాటు నేను కూడా వస్తాను అంటుంది. ఎందుకు అంటే కార్తీక్ కోసం నాకు తనని చూడాలని అనిపిస్తుంది. నీతో పాటు వస్తే కార్తీక్ ఏదో రోడ్డు మీద కనిపిస్తాడు వాళ్ళ ఇంటికి వెళ్లొద్దని చెప్పావు కదా అందుకే రోడ్డు మీద చూస్తాను.

దీప మాత్రం కోప్పడుతుంది. నాకు మన ఇల్లు కార్తీక్ గుర్తు వస్తున్నాయని చెప్తుంది. దీప మాత్రం ఏం మాట్లాడకుండా తనని తీసుకెళ్ళి పడుకోబెట్టేస్తుంది. ఇక తెల్లారగానే దీప సైకిల్ పట్టుకుని టిఫిన్ క్యారేజ్ లు పట్టుకుని బయల్దేరుతుంది. శౌర్య మళ్ళీ తనకు కార్తీక్ ని చూడాలని అనిపిస్తుందని చెప్తుంది.

ఇంట్లో నన్ను పెట్టేసి తలుపు బయట గడియ పెట్టి వెళ్ళు లేదంటే కార్తీక్ కోసం రోడ్డు మీదకు వెళ్లిపోతానని అంటుంది. దీప నచ్చజెప్పడానికి చూసినా కూడా శౌర్య వినిపించుకోదు. కార్తీక్ నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు అనేసరికి దీప కంగారుపడుతుంది. ఫ్రెండ్ మాత్రమే కాదు అంటే బెస్ట్ ఫ్రెండ్ అని అర్థం అనేసి డోర్ వేసేసుకుంటుంది.

 

నీ సీక్రెట్ నాకు తెలుసు 

శౌర్య మాటలు గుర్తు చేసుకుని కంగారుపడిన దీప ఇంటి బయట తలుపు గడియ పెట్టేసి వెళ్తుంది. గోడ మీద కార్తీక్ పేరు చూసి నన్ను మర్చిపోయావా ఐ మిస్ యూ అని ఏడుస్తుంది. రౌడీ ఎలా ఉందో దాన్ని కాపాడాలని చూస్తే దాన్నే నాకు దూరం చేశావని కార్తీక్ అనుకుంటాడు.

జ్యోత్స్న సైలెంట్ గా వచ్చి కార్తీక్ వెనుక నిలబడుతుంది. నీ గురించి నీకు మాత్రమే తెలిసిన సీక్రెట్ ఒకటి నాకు తెలుసు బావ. దీప కనిపించిందా? తను ఎందుకు వెళ్లిపోయిందో నీకు తెలుసా? అని అడుగుతుంది. తెలియదని చెప్తాడు. సీక్రెట్ ఏంటని అడుగుతాడు కానీ జ్యోత్స్న మాత్రం తెలివిగా మాట్లాడుతుంది.

దీపకు నరసింహ ఎదురుపడతాడు. ఇల్లు వదిలేసి వచ్చారంట కదా నీ కోసం నీకు బాగా ఇష్టమైన వాళ్ళు వెతుకుతున్నారు. ఇలా కనిపించకుండా పోయి ఉండాల్సిన అవసరం నీకు ఏంటి? అని అడుగుతాడు. నిజం బయట పడటంతో నేను ఎక్కడ గొడవ పడతానోనని ఇలా ఇల్లు మార్చావా అంటాడు.

చొక్కా పట్టుకుని దులిపేసిన దీప 

నీ గురించి మా అమ్మకు చెప్పాను కానీ నన్ను లాగిపెట్టి కొట్టి నువ్వు నిప్పు అంది. కానీ నువ్వు బొగ్గువి అని నాకు తెలుసు. ఇన్నాళ్ళూ నాకు అనుమానం ఉండేది. అది కార్తీక్ బాబు నిజం చేశాడు. దీపకు మొగుడిని నేనే కానీ దాని కూతురు తండ్రి మాత్రం వాడు. నీకు ఆ కార్తీక్ బాబుకు పుట్టిన కూతురు అనేసరికి దీప చెంప పగలగొడుతుంది.

 

తన గురించి తప్పుగా మాట్లాడితే ఒప్పుకునేది లేదని వార్నింగ్ ఇస్తుంది. నరసింహ మాత్రం చాలా నీచంగా మాట్లాడతాడు. చెప్పుతో కొడతాను నా గురించి తప్పుగా మాట్లాడితే అంటుంది. నిజం బయట పడితే ఏమవుతుందోనని నిన్ను తీసుకొచ్చి ఈ ఏరియాలో పెట్టాడు. ఎవరికీ డౌట్ పడకుండా ఇలా కొత్త అవతారం ఎత్తావు.

వాడు అనడం కాదు నేను అంటున్నా అది వాడికి నీకు పుట్టిన కూతురే అనేసరికి మళ్ళీ దీప నరసింహను కొడుతుంది. చొక్కా కాలర్ పట్టుకుని దులిపేస్తుంది. నాకు వ్యక్తిత్వం ఉంది దాన్ని నేను ఎవరి కోసం వదులుకొను. నా గుణాన్ని వేలెత్తి చూపిస్తే చెయ్యి నరికేస్తాను. నా దారికి అడ్డు రాకు అనేసి వెళ్ళిపోతుంది.

నిన్ను వదిలిపెట్టను. నిన్ను ఏడిపిస్తాను. మా అమ్మ గుడ్డిగా నమ్ముతుంది కానీ నేను నమ్మను అని అనుకుంటాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

WhatsApp channel
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024