Warangal Murders: వరంగల్‌లో ఘోరం, ప్రేమ పెళ్లి పంచాయితీ, యువతి తల్లిదండ్రుల హత్య

Best Web Hosting Provider In India 2024

Warangal Murders: వరంగల్‌ జిల్లాలో దారుణం జరిగింది. చంద్రరావు పేట మండలంలోని పాపయ్యపేట శివారు పదహారు చింతలతండాలో భార్యాభర్తలు హత్యకు గురయ్యారు. గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. మృతులను బానోతు శ్రీను, సుగుణగా గుర్తించారు. ఈ ఘటనలో వారి కుమారుడు, కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

పదహారు చింతల తండాకు చెందిన దీపికకు మహబూబాబాద్‌కు చెందిన నాగరాజు అలియాస్ బన్ని అనే యువకుడితో ప్రేమ వివాహం జరిగింది. ఈ పెళ్లి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు కొద్ది రోజుల క్రితం పంచాయితీ పెట్టి పెద్ద మనుషుల సమక్షంలో తమ కుమార్తెను తమ వెంట తీసుకెళ్లిపోయారు. యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వారిపై ఆగ్రహంతో ఉన్న బన్ని బుధవారం రాత్రి నిద్రిస్తున్న వారిపై దాడి చేశాడు.

అర్థరాత్రి యువతి కుటుంబ ఆరుబయట నిద్రిస్తుండగా తల్వార్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి తల్లి బానోత్ సుగుణ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె తండ్రిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. దీపికతో పాటు ఆమె సోదరుడు మదన్ పరిస్థితి విషమంగా ఉంది. మొదట వారిని నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన నాగరాజు పరారీలో ఉన్నాడు.

WhatsApp channel

టాపిక్

Crime NewsCrime TelanganaTelugu NewsLatest Telugu NewsBreaking Telugu NewsWarangal
Source / Credits

Best Web Hosting Provider In India 2024