TG Govt GO 317 : ఉద్యోగుల దరఖాస్తులపై జీఏడీకి ఆదేశాలు – జీవో 317పై కేబినేట్‌ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు

Best Web Hosting Provider In India 2024

జీవో 317 పై ఏర్పాటైన కేబినెట్‌ సబ్ కమిటీ గురువారం సమావేశమైంది. ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది.

క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్త చేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ సబ్ కమిటీకి చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాకాధిపతులకు పంపించాల్సిందిగా జీఏడీ అధికారులకు సబ్ కమిటీ ఆదేశించింది.

మిగతా దరఖాస్తులను వివిధ శాఖలకు పంపి వాటిని పరిశీలన చేసిన అనంతరం తిరిగి క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకురావాలని కమిటీ నిర్ణయించింది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం లో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు, శివశంకర్ (రిటైర్డ్ IAS)తో పాటు జీఏడీ అధికారులు పాల్గొన్నారు.

WhatsApp channel

టాపిక్

Government EmployeesGovernment Of Telangana
Source / Credits

Best Web Hosting Provider In India 2024