Best Web Hosting Provider In India 2024
CBN With CII: విధానపరమైన సంస్కరణల వల్ల రాజకీయంగా కొంత నష్టం జరిగినా అంతిమంగా వాటితో ప్రజలకు మేలే జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా సిఐఐ ప్రతినిధులతో వర్చువల్‌గా భేటీ అయ్యారు.
P4 విధానంలో భాగస్వాములు అవ్వాలని సీఐఐ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది మరోసారి విశాఖలో సీఐఐ భేటీ నిర్వహించాలని కోరారు. సిఐఐ ప్రతినిధులంతా విశాఖ రావాలని విజ్ఞప్తి చేశారు. పేదరికం లేని సమాజం తన లక్ష్యం అని వెల్లడించారు.
రాష్ట్రంలోని వనరులు, అవకాశాల గురించి వివరిస్తూ సీఐఐ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అందుకు ప్రభుత్వం తరపున అవసరమైన సాయం చేస్తామని వెల్లడించారు. రాష్ట్రాన్ని పునర్నించే క్రమంలో పరిశ్రమలకు మెరుగైన రాయితీలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పేదరికం లేని సమాజ స్థాపనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సంస్కరణలు రాజకీయంగా నష్టం చేకూర్చినా ప్రజలకు మంచి చేస్తాయని కొన్ని ఘటనలను కూలంకషంగా సీఐఐ ప్రతినిధులకు వివరించారు.
ప్రభావశీలంగా సిఐఐ…
తాను నాలుగో సారి ముఖ్యమంత్రిగా ఉన్నానని, 1995లో తొలిసారిగా నేను ముఖ్యమంత్రి అయినప్పుడు సీఐఐ చిన్న సంస్థగా ఉండేదని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అదే సీఐఐ పెద్ద సంస్థగా ఎదిగిందని, ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగలిగే సంస్థగా మారిందన్నారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితిలో షెడ్డుల్లో, హోటల్ లో కాన్ఫరెన్స్ నిర్వహించుకునే దుస్థితి ఉండేదని,. ప్రస్తుత పరిస్థితి చూస్తే సేవా రంగం, పబ్లిక్ గవర్నెన్స్, ప్రైవేట్ గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ తో సహా ప్రతి రంగంలో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు రాణిస్తున్నారని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ భారతీయులను నమ్ముతారు. ఇదొక శుభ పరిణామమని ప్రపంచవ్యాప్తంగా వెల్త్ క్రియేషన్, సేవా రంగంలో భారతీయులు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో ఇండియా నెంబర్ 1 లేదా నెంబర్ 2 స్థానంలో ఉండనుంది.
విద్యుత్ సంస్కరణలకు కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్
1998లోనే తొలిసారి విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని, ప్రధానంగా ట్రాన్స్ మిషన్, జనరేషన్, సంస్థలకు పంపిణీ. దేశంలోనే తొలిసారిగా రెగ్యులేటరీ కమిషన్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్‌లోనే అని చెప్పారు. ఓపెన్ స్కై పాలసీ ద్వారా హైదరాబాద్ నుంచి దుబాయ్ కి ఫస్ట్ ఎమిరేట్ ఫ్లైట్ తీసుకొచ్చామని అదే సమయంలో తొలిసారి హైదరాబాద్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి నాంది పలికామని చెప్పారు. ఆ తర్వాతే బెంగుళూరు, ముంబయి మొదలైనవి చేపట్టాయన్నారు.
పబ్లిక్ పాలసీలను బలంగా విశ్వసిస్తానని చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సంక్షేమం అనేది పేదరికాన్ని పారద్రోలే విధంగా ఉండాలని ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలన్నారు. పేదరికం పోగొట్టేందుకు మనం ఏదైనా చేద్దామని ఆర్థిక సంస్కరణల తర్వాత ఈరోజు మీ సమక్షంలో పబ్లిక్, ప్రైవేట్ పీపుల్స్ పార్ట్ నర్ షిప్ (పీ4) పాలసీని ప్రవేశపెట్టబోతున్నట్టు చెప్పారు. అందరూ బాగా పని చేస్తున్నారు. పీపుల్ అంటే కేపిటల్ అని, ఇతర అంశాలన్నీ కేపిటల్ కు అదనంగా ఉంటాయన్నారు.
షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ ప్రణాళికలున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తే బాగుంటుందో మీరు చెప్పాలి. మీరు మాకు మార్గదర్శకత్వం అందించండి. అవకాశాలు సృష్టించుకొని ముందుకెళ్దామన్నారు. పేదరికం లేని దేశాన్ని ఎలా నిర్మించాలనే దాని గురించి ఆలోచిద్దాం. జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్, జీరో పావర్టీ లోకాలిటీ మన లక్ష్యం కావాలన్నారు.
రాష్ట్రంలో విశాలమైన సముద్ర తీరం ఉంది. సమర్థవంతమైన మౌలిక సదుపాయాలు, అవసరమైన మానవ వనరులున్నాయి. మా రాష్ట్రంలో ఆటోమొబైల్, హార్డ్ వేర్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మా, అగ్రోప్రాసెసింగ్, తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ సిటిలో మంచి అవకాశాలున్నాయన్నారు. రాష్ట్రానికి దగ్గర్లో బెంగుళూరు ఎయిర్ పోర్ట్ ఉంది. గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ అమలు చేసే ఆలోచన ఉందన్నారు. రాబోయే 4,5 నెలల్లో సోలార్, విండ్ , పంప్డ్ ఎనర్జీ అమలు చేసే తొలి కార్యక్రమం చేపట్టబోతున్నట్టు చెప్పారు
విశాఖను ఫిన్‌టెక్ హబ్‌గా మారుస్తాం…
గతంలో మేం విశాఖపట్నాన్ని ఫిన్ టెక్ హబ్ గా తీర్చిదిద్దామని, లండన్, సింగపూర్ ను మోడల్ గా తీసుకొని విశాఖను ఫిన్ టెక్ హబ్ గా మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాలన్న అంశంపై ఆలోచిస్తామని, పరిశ్రమలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తామన్నారు. త్వరలోనే విశాఖలో సిఐఐ సమ్మిట్ ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు.
టాపిక్