Best Web Hosting Provider In India 2024
Ram Charan New Car: మెగా హీరో రామ్‌చరణ్ కొత్త కారు కొన్నాడు. ఇండియాలో ఈ ఖరీదైన కారును ఇప్పటివరకు ఇద్దరు సెలబ్రిటీలు మాత్రమే కొనుగోలు చేశారు. ఆ ఇద్దరిలో రామ్‌చరణ్ ఒకరు. శుక్రవారం జరుగనున్న అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం రామ్‌చరణ్ ముంబై బయలుదేరాడు. ఎయిర్‌పోర్ట్‌కు సతీమణి ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారులో వచ్చారు రామ్‌చరణ్. ఈ కారును తానే స్వయంగా డ్రైవ్ చేస్తూ కనిపించారు. రామ్‌చరణ్ రోల్స్ రాయిస్ కారు డ్రైవ్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.
ఏడున్నర కోట్లు….
రామ్‌చరణ్ ఇటీవలే ఈ రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారు ఖరీదు ఏడున్నర కోట్లుగా చూపిస్తోంది. చరణ్ దగ్గర ఉన్న అతి ఖరీదైన కారు ఇదేనని సమాచారం. అంతే కాదు ఇండియా మొత్తంలో ఈ కారును కొన్న సెకండ్ సెలబ్రిటీగా, సౌత్ ఇండియాలో మొదటి వ్యక్తి గా చరణ్ నిలిచాడు. ఈ ఏడాది జనవరిలో ఈ కారు లాంఛ్ అయ్యింది.
చరణ్ దగ్గర ఉన్న కార్లు ఇవే…
చరణ్ దగ్గర ఇప్పటికే వివిధ మోడల్స్‌కు చెందిన ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆస్టో మార్టిన్ వాంటేజ్ (3.2 కోట్లు), ఫెరారీ ఫోర్టోఫీనో (మూడున్నర కోట్లు), రేంజ్ రోవర్ ఆటోబ్రయోగ్రఫీ (2.75 కోట్లు) మెర్సిడేజ్ మేబ్యాచ్ (నాలుగు కోట్లు) టాప్ బ్రాండ్స్ కార్లను చరణ్ కొనుగోలు చేశారు. తాజాగా వాటితో పాటు చరణ్ రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారును చరణ్ గ్యారేజీలో చేరింది.
అంబానీ పెళ్లి వేడుకలకు…
అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు టాలీవుడ్ నుంచి కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం అందినట్లు సమాచారం. వారిలో చరణ్ ఒకరు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలకు భార్యతో కలిసి చరణ్ హాజరుకాబోతున్నాడు.
గేమ్ ఛేంజర్‌తో బిజీ…
రామ్‌చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తోన్నాడు. కోలీవుడ్ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీలో రామ్‌చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి, నవీన్‌చంద్ర, ఎస్‌జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ మూవీని దిల్‌రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్‌కు ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
ఉప్పెన దర్శకుడితో…
గేమ్ ఛేంజర్ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో ఓ సినిమా చేయబోతున్నాడు రామ్‌చరణ్. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకాబోతోంది. రా అండ్ రస్టిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీలో కన్నడ అగ్ర హీరో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.