Birthday Boy Trailer: సినిమా రిలీజ‌య్యే వ‌ర‌కు నా ముఖం ఎవ‌రికి చూపించ‌ను – బ‌ర్త్ డే బాయ్ డైరెక్ట‌ర్ కామెంట్స్‌

Best Web Hosting Provider In India 2024


Birthday Boy Trailer: ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ది బ‌ర్త్‌డే బాయ్ మూవీ జూలై 19న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు విస్కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ది బ‌ర్త్ డే బాయ్ ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు ద‌ర్శ‌కుడు ముఖం క‌నిపించ‌కుండా మాస్క్ ధ‌రించి హాజ‌ర‌య్యాడు. అంతేకాదు ఈ వేడుక‌కు హాజ‌రైన అతిథులు కూడా మ‌హేష్‌బాబు, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు ప‌లువురు హీరోల మాస్క్‌లు హాజ‌రై అటెండ్ అయ్యారు.

సినిమా రిలీజైన త‌ర్వాతే..

ఈ వేడుక‌లో డైరెక్ట‌ర్ మాట్లాడుతూ నా జీవితంలో తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటన ఆధారంగా ది బ‌ర్త్ డే బాయ్ క‌థ రాసుకున్నాను. ఈ సినిమా నచ్చితే ఇద్దరికి చెప్పండి. నచ్చకపోతే పది మందికి చెప్పండి. నా అసలు పేరును, నా ఫేస్‌ను సినిమా విడుదలైన తరువాత రివీల్‌ చేస్తాను. అప్ప‌టివ‌ర‌కు నా ముఖం ఎవ‌రికి చూపించ‌ను అని తెలిపాడు.

ఫ‌న్ డ్రామా మూవీ…

నిర్మాత ఐ.భరత్‌ మాట్లాడుతూ ఇదొక ఫ‌న్ డ్రామా మూవీ. ప్ర‌తి క్యారెక్ట‌ర్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు మూవీ న‌వ్విస్తుంది. ఎం.ఎస్ చ‌ద‌వ‌డానికి విదేశాల‌కు వెళ్లిన ఐదుగురు చిన్న‌నాటి స్నేహితుల‌కు ఎదురైన అనుభ‌వాలు, వాటి ప‌ర్య‌వ‌సానాలు ఫ‌న్నీగా ఈ మూవీలో చూపించ‌బోతున్నాం. నాచురాలిటీ కోసం సినిమాలో సింక్ సౌండ్ వాడాం. కంటెంట్‌తో పాటు మంచి టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ మూవీని తెర‌కెక్కించాం అని అన్నారు.

డిఫ‌రెంట్ కంటెంట్‌…

రవికృష్ణ మాట్లాడుతూ ది బ‌ర్త్ డే బాయ్ డిఫ‌రెంట్ కంటెంట్‌తో ఆడియెన్స్‌కు కొత్త అనుభూతిని పంచుతుంది అన్నాడు. ఈ చిత్రంలో తను నటించకపోయినాసినిమా కోసం ఈ టీమ్‌ కష్టాన్ని చూసి ప్రమోషన్‌ సహాయం చేస్తున్నానని జ‌బ‌ర్ధ‌స్త్‌ రోహిణి తెలిపారు ఈ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌కు రోహిణి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించింది. బొమ్మ బొరుసా ప‌తాకంపై ఐ.భరత్‌ నిర్మిస్తున్నారు.

టీవీ సీరియ‌ల్ యాక్ట‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ర‌వికృష్ణ గ‌త కొన్నాళ్లుగా సినిమాల‌పై ఫోక‌స్ పెడుతోన్నాడు. విరూపాక్ష‌లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించాడు. ఆ త‌ర్వాత గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది, ఆ ఒక్క‌టి అడ‌క్కులో కీల‌క పాత్ర‌లు చేశాడు.

ల‌వ్ మూవీ మూవీలో…

దిల్‌రాజు వార‌సుడు ఆశీష్ హీరోగా న‌టించిన ల‌వ్ మూవీలో ర‌వికృష్ణ ఓ ఫుల్ లెంగ్త్ రోల్‌లో క‌నిపించాడు.తెలుగులో హృద‌యం, బొమ్మ‌రిల్లు, వ‌రుధూణి ప‌రిణ‌యం, మ‌న‌సు మ‌మ‌త‌, సుంద‌ర‌కాండ, ఆమె క‌థ‌తో పాటు ప‌లు సీరియ‌ల్స్‌లో లీడ్ రోల్స్ చేశాడు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024