Music Shop Murthy OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Best Web Hosting Provider In India 2024

మ్యూజిక్‍షాప్ మూర్తి సినిమా రిలీజ్‍కు ముందు మంచి బజ్ తెచ్చుకుంది. సీనియర్ యాక్టర్ అజయ్ ఘోష్, హీరోయిన్ చాందినీ చౌదరి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా పర్వాలేదనిపించాయి. ఇప్పుడు మ్యూజిక్‍షాప్ మూర్తి చిత్రం ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‍ఫామ్ ఇవే

మ్యూజిక్‍షాప్ మూర్తి సినిమా ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తోంది. ఈ చిత్రం జూలై 16వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై ఈటీవీ విన్ అధికారిక ప్రకటన చేసింది. జూలై 16న స్ట్రీమింగ్ అంటూ పోస్టర్ తీసుకొచ్చింది.

మ్యూజిక్‍షాప్ మూర్తి చిత్రంలో అజయ్ ఘోష్, చాందినీ చౌదరీ మెయిన్ రోల్స్ చేయగా.. ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శివ పాలడుగు దర్శకత్వం వహించారు. డీజే కావాలని లక్ష్యంగా పెట్టుకునే 50 ఏళ్ల వ్యక్తి చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్.

మ్యూజిక్‍షాప్ మూర్తి మూవీని ఫ్లై హై సినిమాస్ పతాకంపై హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ మూవీని నిర్మించారు. పవన్ సంగీతం అందించారు. శ్రీనివాస్ బెజుగం సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ చేశారు.

మ్యూజిక్‍షాప్ మూర్తి స్టోరీలైన్

ఓ చిన్న టౌన్‍లో 50 ఏళ్ల మూర్తి (అజయ్ ఘోష్) ఓ మ్యూజిక్‍షాప్ నడుపుతుంటారు. అయితే ట్రెండ్ మారుతుండటంతో షాప్ సరిగా నడవదు. ఆదాయం పడిపోతుంది. ఆ షాప్ మూసేయాలని అతడి భార్య (ఆమని) వాదిస్తుంటుంది. అయితే, సంగీతంపై ప్రేమతో షాప్ అలాగే కొనసాగిస్తాడు. అయితే, డీజే నేర్చుకోవాలని మూర్తికి చెబుతుంది అంజన (చాందినీ చౌదరి). దీంతో 50 ఏళ్ల వయసులో డీజే కావాలని మూర్తి నిర్ణయించుకుంటాడు. దీంతో చాలా సవాళ్లు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? మూర్తి డీజే అయ్యాడా? అనేది మ్యూజిక్‍షాప్ మూర్తి చిత్రంలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

హరోం హర కొత్త డేట్

నవ దళపతి సుధీర్ బాబు హీరోగా నటించిన హరోం హర సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో సందిగ్ధత వీడింది. జూలై 11వ తేదీనే ఈ చిత్రం ఈటీవీ విన్, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు రావాల్సి ఉంది. అయితే, వాయిదా పడింది. ఈ తరుణంలో ఈ సినిమా కొత్త స్ట్రీమింగ్ డేట్‍ను ఈటీవీ విన్ నేడు ప్రకటించింది. జూలై 18వ తేదీన ఈ మూవీని తీసుకురానున్నట్టు వెల్లడించింది.

హరోం హర చిత్రంలో వివాదాస్పద యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు నటించడమే ఓటీటీ రిలీజ్‍‍కు ఆలస్యంగా తెలుస్తోంది. ఓ తండ్రీకూతుళ్ల వీడియోపై యూట్యూబ్‍లో అసభ్య వాఖ్యలు చేసిన ప్రణీత్ అరెస్ట్ అయ్యాడు. అతడిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సుధీర్ బాబు కూడా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణీత్ హనుమంతు నటించిన సీన్లను కట్ చేసి ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. అందుకే జూలై 18కి స్ట్రీమింగ్ డేట్‍ను ఈటీవీ విన్ వాయిదా వేసింది. ఆహా ఓటీటీ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024