RC16: రామ్ చరణ్ బుచ్చి బాబు సినిమాలో కన్నడ సూపర్ స్టార్.. కన్ఫర్మ్ చేసిన మేకర్స్

Best Web Hosting Provider In India 2024

Shiva Rajkumar In Ram Charan RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రెండు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా. ఈ మూవీపై ఇప్పటికే ఎనలేని బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా షూటింగ్ ఇంకో 10 నుంచి 20 శాతం వరకు మిగిలిపోయిందని డైరెక్టర్ శంకర్ ఇటీవల చెప్పారు.

ఆ మొత్తం షూటింగ్ కంప్లీట్ అయి, ఎడిటింగ్ ఫైనల్ అయిన వెంటనే గేమ్ ఛెంజర్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని భారతీయుడు 2 మూవీ ప్రమోషన్స్‌లో డైరెక్టర్ శంకర్ చెప్పారు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న మరో క్రేజీ మూవీ ఆర్సీ 16. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై కూడా విపరీతమైన బజ్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న బాలీవుడ్ బ్యూటి జాన్వీ కపూర్ ఆర్సీ 16 మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది. ఇది ఆమెకు తెలుగులో రెండో సినిమా కానుంది. రామ్ చరణ్ జాన్వీ కపూర్ బుచ్చి బాబు సాన కాంబినేషన్‌లో వస్తోన్న ఆర్సీ 16 చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ఇలా ఒక్కో క్యాస్ట్ భారీగా ఉండటంతో ఆర్సీ16పై సైతం అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే, పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సగర్వ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై మెగా-బడ్జెట్, హై-క్లాస్ ప్రొడక్షన్, టెక్నికల్‌ వాల్యూస్‌తో రూపొందే ఈ మోస్ట్ ఎవెయిటింగ్ ప్రాజెక్ట్ RC16తో వెంకట సతీష్ కిలారు గ్రాండ్‌గా ఫిల్మ్ ప్రొడక్షన్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో వివిధ భాషలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు. తాజగా ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ కరుణాడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ నటించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టీమ్ RC16 తెలుగు సినిమాకి కరుణాడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ ఎరైవల్‌ని సెలబ్రేట్ చేసుకుంటుంది. కన్నడ సూపర్ స్టార్ ఈ చిత్రంలో వెరీ పవర్ ఫుల్ రోల్ పోషించడానికి సైన్ చేశారు.

ఈ న్యూస్‌ని శివ రాజ్‌కుమార్ పుట్టినరోజు అయిన శుక్రవారం (జూలై 12) నాడు ప్రత్యేక సందర్భంగా అనౌన్స్ చేశారు. ఈ వార్తతో ఇద్దరు స్టార్స్ అభిమానులు ఆనందంగా ఉన్నారు. సౌత్ ఇండియాలోని ఇద్దరు స్టార్ హీరోలను ఒకే తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ మ్యాసీవ్ మూవీకి ఆర్ రత్నవేలు డీవోపీ కాగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, RRR గ్లోబల్ సక్సెస్‌తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ తెచ్చింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా చేస్తున్న సినిమాలు గేమ్ ఛేంజర్ అండ్ ఆర్సీ 16. అయితే, జూలై 12న విడుదలైన ఇండియన్ 2 సినిమా చూసిన రామ్ చరణ్ అభిమానులకు గేమ్ ఛేంజర్ మూవీపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భారతీయుడు 2పై వస్తోన్న ట్రోలింగ్‌తో గేమ్ ఛేంజర్ ఎలా ఉంటుందో అని కంగారు పడుతున్నారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024