Balakrishna: వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన బాలకృష్ణ అభిమానులు.. అది ఎలా అంటే?

Best Web Hosting Provider In India 2024

Balakrishna Fans World Record: 1974 సంవత్సరంలో తాతమ్మ కల చిత్రంతో నటసార్వభౌమ, స్వర్గీయ ఎన్టీఆర్ నట వారసుడిగా వెండితెరకి పరిచయమై తన అద్భుత నటనతో అంచెలంచెలుగా ఎదిగారు నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ. అంతేకాకుండా ” తండ్రికి తగ్గ తనయుడు” గా అందరి ప్రశంసలు పొంది , విశ్వవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు బాలయ్య బాబు.

 

అలాంటి లెజెండ్ బాలయ్య గారి సినీ ప్రస్థానం 50 వసంతాలు పూర్తి చేసుకోవడం అరుదైన గౌరవంగా భావిస్తున్నారు ఆయన అభిమానులు. భారతదేశ సినీ చరిత్రలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏకైక అగ్ర కథానాయకుడుగా కొత్త చరిత్ర కు శ్రీకారం చుట్టారు బాలయ్య. తన తండ్రి NTR తర్వాత నేటితరంలో పౌరాణిక, సాంఘిక, జానపద, చారిత్రాత్మక చిత్రాలు చేసి.. అన్ని జనరేషన్స్ ప్రేక్షకులను మెప్పించిన ఒకే ఒక్కడు బాలయ్య.

అలాంటి ఒక్కడు మన తెలుగువారందరికి గర్వకారణం అని అభిమానులు అంటున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక 50 వసంతాల సందర్భంగా బాలయ్య సినీ స్వర్ణోత్సవ సంబరాలను ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ (NBK HELPING HANDS) అధ్యక్షుడు అనంతపురం జగన్, బాలయ్య అభిమానులను ఒక టీమ్‌గా ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత వైభవంగా 50 రోజుల పాటు ఈ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు.

అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా హైదరాబాద్‌లో ఘనంగా వేడుకలు చేయడానికి సిద్ధం కానుందని తెలుస్తోంది. గతంలో NBK HELPING HANDS ఆధ్వర్యంలో బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి కోసం 70 రోజుల పాటు భారతదేశ శతపుణ్యక్షేత్ర జైత్రయాత్రని చేపట్టి ఒక చరిత్రను సృష్టించారు.

 

అంతేకాకుండా బాలయ్య 60వ పుట్టినరోజు వేడుకలను విశ్వవ్యాప్తంగా ఉండే బాలయ్య అభిమాన సోదరులందరు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఒకే సమయంలో తొంభై వేల మందికి పైగా కేక్ కట్ చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పి బాలయ్య అభిమానుల సత్తాని చాటారు. ఇప్పుడు మరోసారి తాము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తమ బాలయ్య కోసం అభిమానులందరు కలిసి అతిపెద్ద పండుగ చేయబోతున్నాం అని అభిమానులు చెబుతున్నారు.

అభిమానులందరి తరుపున ఈ వేడుకను నిర్వహించడానికి అవకాశం కల్పించిన బాలయ్య గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల భగవంత్ కేసరి మూవీతో మంచి హిట్ అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ తర్వాత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు మళ్లీ సినిమాలై ఫోకస్ పెట్టారు బాలయ్య బాబు.

వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న 109వ సినిమాకు ఫుల్ బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన టీజర్ బాలయ్య అభిమానులతో పాటు మాస్ ఆడియెన్స్‌ను అలరించింది. అయితే ఈ సినిమాకు వీర మాస్ అనే టైటిల్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఒక టాక్ వినిపిస్తోంది.

 
WhatsApp channel
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024