Best Web Hosting Provider In India 2024
Karataka Damanaka OTT: శివరాజ్‌కుమార్, ప్రభుదేవా హీరోలుగా నటించిన కన్నడ మూవీ కరటక దమనక మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ యాక్షన్ డ్రామా మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం అమెజాన్‌లో కరటక దమనక కన్నడ వెర్షన్ మాత్రమే రిలీజైంది. త్వరలోనే తెలుగు, తమిళం, మలయాళంతోపాటు హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం.
17 ఏళ్ల తర్వాత…
కరటక దమనక మూవీకి యోగ్‌రాజ్ భట్ దర్శకత్వం వహించాడు. రాక్‌లైన్ వెంకటేష్ ప్రొడ్యూస్ చేశాడు. ఈసినిమాలో ప్రియా ఆనంద్, నివీక్షా నాయుడు హీరోయిన్లుగా నటించాడు. ఈ సినిమాతో దాదాపు పన్నెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రభుదేవా హీరోగా కన్నడ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాడు. టైటిల్‌తోనే కటరక దమనక కన్నడ ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని కలిగించింది. పంచతంత్రం మిత్రబేధం కథ లోని పదాలతో ఈ మూవీకి టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
మిక్స్‌డ్ టాక్…
మార్చిలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది. థియేటర్లలో మూడు కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది.కాన్సెప్ట్, శివరాజ్‌కుమార్ యాక్టింగ్ బాగున్నా ఆర్ట్ ఫిలిం అనే టాక్ బయటకు రావడంతో ఈ సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.
ఇద్దరు మిత్రుల కథ…
కరటక (శివరాజ్‌కుమార్), దమనక (ప్రభుదేవా) ఓ నేరంలో జైలు శిక్షను అనుభవిస్తుంటారు.వారి మంచితనం గమనించిన జైలర్ రమేష్ (రాకల్‌లైన్ వెంకటేష్) వారికో బాధ్యతను అప్పగిస్తాడు. పల్లెటూరును వదిలిపెట్టమని పట్టుబడుతోన్న తన తల్లిదండ్రులను సిటీకి తీసుకురావాలని, అలా చేస్తే జైలు నుంచి ఇద్దరిని విడిపిస్తానని చెబుతాడు.
జైలర్ డీల్‌కు కరటక, దమనక ఒప్పుకుంటారు. జైలర్ తల్లిదండ్రులు ఉంటున్న నందికోలూరు అనే ఊరికి వెళతారు. ఆ పల్లెటూరిలో కరటక, దమనకలకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? కరువు కాటకాలతో అల్లాడిపోతున్న ఆ ఊరిని కరటక, దమనక ఎలా బాగుచేశారు? కరటక, దమనక అసలు పేర్లు ఏమిటి? ఈ కథలో కుసుమ (ప్రియా ఆనంద్), కెంపి(నివీక్షా నాయుడు) పాత్రలు ఏమిటి? అన్నదే ఈ మూవీ కథ.
తనికెళ్ల భరణి ఫుల్ లెంగ్త్ రోల్…
ఈ కన్నడ మూవీలో తెలుగు నటుడు తనికెళ్లభరణి ఫుల్‌లెంగ్త్ రోల్‌లో కనిపించాడు. పి రవిశంకర్ విలన్ పాత్రలో కనిపించాడు. ప్రొడ్యూసర్ రాకల్‌లైన్ వెంకటేష్ జైలర్‌గా నటించాడు. కరటక దమనకలో హీరోగా నటిస్తూనే ఈమూవీకి కొరియోగ్రాఫర్‌గా ప్రభుదేవా వ్యవహరించాడు.
రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీలో…
ప్రస్తుతం శివరాజ్‌కుమార్ తెలుగులో రామ్‌చరణ్, బుచ్చిబాబు సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీతోనే శివరాజ్‌కుమార్ టాలీవుడ్‌లోకిఎంట్రీ ఇస్తోన్నాడు. రా అండ్ రాస్టిక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవర్‌ఫుల్ రోల్‌లో శివరాజ్‌కుమార్ కనిపించనున్నట్లు చెబుతోన్నారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రభుదేవా బిజీగా ఉన్నాడు. దళపతి విజయ్ ది గోట్‌లో ప్రభుదేవా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తమిళంలో హీరోగామూడు సినిమాలు చేస్తోన్నారు. మలయాళంలో అనుష్క కథనార్‌లో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోన్నాడు.