Shivam Bhaje: యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా మరో ప్రయోగం- సస్పెన్స్ థ్రిల్లర్‌గా శివం భజే

Best Web Hosting Provider In India 2024

Shivam Bhaje Release Date Locked: తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా పాపులర్ అయ్యారు ఓంకార్. ఆయన సోదరుడు అశ్విన్ బాబు హీరోగా అనేక సినిమాలతో అలరిస్తున్నాడు. హీరోగా సూపర్ సక్సెస్ అందుకోవాలని బాగా కష్టపడుతున్న అశ్విన్ బాబు ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్‌చేస్తున్నాడు.

ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రంగా శివం భజేతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అశ్విన్ బాబు. అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో హీరోయిన్‌గా దిగంగనా సూర్యవంశీ చేసింది. బాలివుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, సాయి ధీన, అయ్యప్ప శర్మ, హైపర్ ఆది, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్ వంటి నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.

తాజాగా శివం భజే రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. శివం భజే చిత్రాన్ని ఆగస్ట్ 1న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. “వైవిధ్యమైన కథతో, సాంకేతిక విలువలతో మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ నిర్మాణంలో ఆగష్టు 1న విడుదల కానుంది శివం భజే సినిమా. దీని ఫస్ట్ లుక్‌కి, టీజర్‌కి అద్భుతమైన స్పందన రావడంతో చిత్ర విజయంపై మాకున్న విశ్వాసం మరింత పెరిగింది” అని తెలిపారు.

“మా హీరో అశ్విన్ బాబు, దర్శకుడు అప్సర్, అర్బాజ్ ఖాన్, సాయి ధీనా, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి వంటి నటులు, ఇండస్ట్రీ మేటి సాంకేతిక నిపుణుల సహకారంతో మా మొదటి చిత్రం అనుకున్నట్టుగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కర్యక్రమాలు చివరి దశలో ఉండగా ఆగష్టు 1న ప్రపంచవ్యప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి సిద్దమవుతున్నాం” అని నిర్మాత అన్నారు.

“శివస్మరణతో మొదలైన మా చిత్రానికి ఆయన ఆశీస్సులతో అద్భుత స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ట్రైలర్, పాటల విడుదల గురించి వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అని ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

“ఆగష్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతూ అన్ని వర్గాల, వయసుల ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉంది మా ‘శివం భజే’. టైటిల్, టీజర్‌తో అందరి దృష్టి ఆకర్షించిన మా చిత్రంపై అన్ని భాషల ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి. మా హీరో అశ్విన్ బాబు, ఇతర నటీ నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత మహేశ్వర రెడ్డి గారి పూర్తి సహకారంతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందింది” అని డైరెక్టర్ అప్సర్ తెలిపారు.

“మా ‘శివం భజే’ టీజర్ కి వచ్చిన అనూహ్య స్పందనకి మా అందరి విశ్వాసం అమాంతం పెరిగిపోయింది. దర్శకుడు అప్సర్ వైవిధ్యమైన కథకి తగ్గట్టుగా కావాల్సిన సాంకేతిక విలువలు, నిపుణులని ఖర్చుకి వెనకాడకుండా మా నిర్మాత మహేశ్వర రెడ్డి గారు సహకారం అందించడం, ప్రతీ ఒక్కరు తమ కెరీర్ బెస్ట్ ఇవ్వడంతో ఈ చిత్రం మేము ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది. ఆ శివుని అనుగ్రహంతో పాటు మీ అందరి ఆశీర్వాదంతో త్వరలోనే మా చిత్రాన్ని మీ ముందుకి తెస్తాం” అని హీరో అశ్విన్ బాబు చెప్పుకొచ్చారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024