Best Web Hosting Provider In India 2024
పీజ్జా ఆర్డర్ చేయడం ఏముంది? అందులో తెలియక పోవడం ఏముంది అనుకుంటే.. ఇది చదవక్కర్లేదు. కానీ పిజ్జా ఆర్డర్ చేసేముందు మీ చేతిలో ఉంచే పెద్ద మెన్యూ కార్డ్ చూసి మీకు కన్ఫ్యూజన్ వస్తుందంటే మాత్రం కొన్ని విషయాలు తెల్సుకోండి. అలాగే చాలా సార్లు పీజ్జా ఆర్డర్ చేశాక మీ రుచికి తగ్గట్లు లేదు అనిపిస్తుంది. అందుకే మీ ఇష్టానికి తగ్గ పీజ్జా పర్ఫెక్ట్‌గా ఎలా ఆర్డర్ చేసుకోవాలో, అందులో ఉండే ఆప్షన్ల గురించి తెల్సుకోండి.
పీజ్జా సైజు:
సాధారణంగా ఏ పీజ్జా షాప్‌లో అయినా స్మాల్ / రెగ్యులర్, మీడియం, లార్జ్ సైజుల్లో పీజ్జా దొరుకుతుంది. స్మాల్ పీజ్జాలో 4 స్లైసులు (ఒక్కరికి సరిపోతుంది), మీడియంలో 6 (ఇద్దరికి సరిపోతుంది), లార్జ్ పీజ్జాలో 8 స్లైసులుంటాయి. దాన్ని బట్టి సైజు ఎంచుకోవాలి. అలాగే కొన్ని షాపుల్లో స్లైసులు తక్కువున్నా కూడా పీజ్జా వ్యాసం పెద్దగా ఉంటుంది.
పీజ్జా క్రస్ట్:
క్రస్ట్ అంటే పీజ్జా అడుగుభాగంలో ఉండే రొట్టె లాంటి భాగం.దీని మీదే చీజ్, టాపింగ్స్ ఉంటాయి.ఇది పీజ్జా రుచిని చాలా మారుస్తుంది. థిన్ క్రస్ట్ (మందం తక్కువగా ఉంటుంది), వీట్ క్రస్ట్( మైదా లేకుండా పూర్తిగా గోధుమపిండితో చేస్తారు), చీజ్ బర్స్ట్(క్రస్ట్ మధ్యలో చీజ్ ఫిల్లింగ్ ఉంటుంది), స్టఫ్డ్ క్రస్ట్ (పీజ్జా క్రస్ట్ లో ఏదైనా స్టఫ్ఫింగ్ ఎంచుకోవచ్చు).. ఇలా చాలా రకాలు షాప్ బట్టి మారతాయి. మీకు చీజ్ నచ్చితే మీరు ఎక్కువగా ఇష్టపడేది మాత్రం చీజ్ బర్స్ట్ క్రస్టే. తినేటప్పుడు చీజ్ కారుతూ ఉంటుంది. చీజ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మీకు చీజ్ అంతగా నచ్చక పోతే థిన్ క్రస్ట్, వీట్ క్రస్ట్, ఫ్రెష్ ప్యాన్ క్రస్ట్ ఎంచుకోవచ్చు.
టాపింగ్స్:
పీజ్జా క్రస్ట్ మీద మనకు కనబడే కూరగాయ ముక్కలు, చికెన్ ముక్కలు, పన్నీర్ ముక్కల్ని టాపింగ్స్ అంటారు. వీటిని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీకు పుట్టగొడుగులు నచ్చకపోతే వాటిని వెయ్యొద్దని చెప్పొచ్చు. మీకు చికెన్ ముక్కలు కావాలంటే వాటిని వేయమని చెప్పొచ్చు. అలాగే మీకు స్వీట్ కార్న్ ఇష్టం అయితే వాటిని ఎక్కువగా వేయమని కూడా చెప్పొచ్చు. వాటి ప్రకారం ధర మారుతుంది.
చీజ్:
చీజ్‌లో బోలెడు రకాలుంటాయి. అయితే మనకు పీజ్జాలో ఎక్కువగా వినిపించేవి మొజరెల్లా చీజ్, చెదార్ చీజ్. మీరు చీజ్ ప్రియులైతే ఎక్స్ట్రా చీజ్ చెప్పి పీజ్జా చేయించుకోవచ్చు. అంటే పీజ్జా క్రస్ట్ మీద టాపింగ్స్ లో ఎక్కువ చీజ్ వేసి పీజ్జా చేస్తారు. దాంతో పీజ్జా రుచి పెరుగుతుంది.
పీజ్జా ఎలా ఆర్డర్ చేయాలంటే:
మెన్యూలో పీజ్జాల పేర్లుంటాయి. వాటికింది వాటి వివరణ ఉంటుంది. ఒకవేళ మీకు అది నచ్చకపోతే ఒక వెజ్ పీజ్జా ఎలా ఆర్డర్ చేయాలో చూద్దాం. వెజ్ పీజ్జా, రెగ్యులర్ సైజ్, చీజ్ బర్స్ట్ క్రస్ట్ తో కావాలి అని చెప్పాలి. టాపింగ్ మార్చాలి అనుకుంటే స్వీట్ కార్న్ బదులుగా టాపింగ్స్‌లో బ్లాక్ ఆలివ్ వేయమని చెప్పొచ్చు.
టాపిక్