Trains Information : రైల్వే ప్రయాణికులు గుడ్ న్యూస్, 48 ఎక్స్ ప్రెస్ రైళ్లలో 96 కొత్త జ‌న‌ర‌ల్ బోగీలు

Best Web Hosting Provider In India 2024

Trains Information : తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాణించే 48 ఎక్స్ ప్రెస్ రైళ్లలో 96 కొత్త జ‌న‌ర‌ల్ బోగీలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఇండియ‌న్ రైల్వే. వీటిలో సికింద్రాబాద్, కాకినాడ‌, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం, మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ రైళ్లు రాక‌పోక‌లు న‌డుపుతున్నాయి. మ‌రో 17 ఇత‌ర రైళ్లకు జ‌న‌ర‌ల్ బోగీలు న‌వంబ‌ర్‌లో అందుబాటులోకి తీసుకొస్తారు.

అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసే రైళ్లు

1. 12703/12704 హౌరా- సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్,

2. 12728/12727 హైదరాబాద్- విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్

3. 17016/17015 సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్

4. 22502/22501 న్యూ టిన్సుకియా- ఎస్ఎంవీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్

5. 15930/15929 న్యూ టిన్సుకియా- తాంబరం ఎక్స్‌ప్రెస్

6. 22504/22503 దిబ్రూఘర్- కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్

7. 15634/15633 గౌహతి-బికనీర్ ఎక్స్‌ప్రెస్,

8. 15631/15632 గౌహతి-బార్మర్ ఎక్స్‌ప్రెస్,

9. 15630/15629 సిల్‌ఘాట్ టౌన్-తాంబరం నాగావ్ ఎక్స్‌ప్రెస్,

10. 15647/15648 గౌహతి-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్,

11. 15651/15652 గౌహతి-జమ్ము తావి ఎక్స్‌ప్రెస్,

12. 15653/15654 గౌహతి-జమ్ము తావి ఎక్స్‌ప్రెస్,

13. 15636/15635 గౌహతి-ఓఖా ఎక్స్‌ప్రెస్,

14. 12510/12509 గౌహతి-బెంగళూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్,

15. 15909/15910 దిబ్రూగర్-లాల్‌గర్ అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్,

16. 20415/20416 వారణాసి-ఇండోర్ సూపర్-ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్,

17. 20413/20414 కాశీ మహాకల్-వారణాసి ఇండోర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్,

18. 13351/13352 ధన్‌బాద్-అలప్పుజా ఎక్స్‌ప్రెస్,

19. 14119/14120 కత్గోడం-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్,

20. 12976/12975 జైపూర్-మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్,

21. 17421/17422 తిరుపతి-కొల్లాం ఎక్స్‌ప్రెస్,

22. 12253/12254 బెంగళూరు-భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్,

23. 16527/16528 యశ్వంత్‌పూర్-కన్నూర్ ఎక్స్‌ప్రెస్,

24. 16209/16210 అజ్మీర్-మైసూర్ ఎక్స్‌ప్రెస్,

25. 16236/16235 మైసూర్-టుటికోరిన్ ఎక్స్‌ప్రెస్,

26. 16507/16508 జోధ్‌పూర్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్,

27. 20653/20654 కేఎస్ఆర్ బెంగళూరు సిటీ-బెలగావి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్,

28. 17311/17312 చెన్నై సెంట్రల్-హుబ్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్,

29. 12253/12254 బెంగళూరు-భాగల్పూర్ అంగ్ ఎక్స్‌ప్రెస్,

30. 16559/16590 బెంగళూరు సిటీ-సాంగ్లీ రాణి చెన్నమ్మ ఎక్స్‌ప్రెస్,

31. 09817/09818 కోట జంక్షన్-దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్,

32. 19813/19814 కోటా-సిర్సా ఎక్స్‌ప్రెస్,

33. 12972/12971 భావ్‌నగర్-బాంద్రా టెర్మినస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్,

34. 19217/19218 వెరావల్ జంక్షన్ ముంబై-బాంద్రా వెరావల్ జంక్షన్ సౌరాష్ట్ర జనతా ఎక్స్‌ప్రెస్,

35. 22956/22955 ముంబై బాంద్రా – భుజ్ కచ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్,

36. 20908/20907 భుజ్ దాదర్-సాయాజీ నగరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్,

37. 11301/11302 ముంబై-బెంగళూరు ఉదయన్ ఎక్స్‌ప్రెస్,

38. 12111/12112 ముంబై-అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్,

39. 12139/12140 ఛత్రపతి శివాజీ టెర్మినల్-నాగ్‌పూర్ సేవాగ్రామ్ ఎక్స్‌ప్రెస్

40. 12709/12710 సికింద్రాబాద్‌-గూడూరు సింహ‌పూరి ఎక్స్‌ప్రెస్‌

41. 12737/12738 కాకినాడ పోర్ట్‌-లింగంప‌ల్లి గౌత‌మి ఎక్స్‌ప్రెస్‌

42. 12755/12756 కాకినాడ పోర్ట్‌-భావ‌న‌గ‌ర్ వీక్లీ సూప‌ర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్

43. 17205/17206 కాకినాడ పోర్టు-సాయిన‌గ‌ర్‌ షిర్డీ ఎక్స్‌ప్రెస్

44. 12775/12776 కాకినాడ పోర్టు-లింగంప‌ల్లి కోక‌నాడ ఎక్స్‌ప్రెస్‌

45. 12759/12760 హైద‌రాబాద్‌-తాంబ‌రం చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌

46. 17211/17212 మ‌చిలీప‌ట్నం-య‌శ్వంత్‌పూర్ కొండ‌వీడు ఎక్స్‌ప్రెస్‌

47. 17215/17216 మ‌చిలీప‌ట్నం-ధ‌ర్మవ‌రం మ‌చిలీప‌ట్నం ఎక్స్‌ప్రెస్‌

48. 17221/17222 కాకినాడ పోర్ట్‌-లోక‌మాన్య తిల‌క్ ఎక్స్‌ప్రెస్‌

నవంబర్ నుంచి జనరల్ క్లాస్ కోచ్‌లు అందుబాటులోకి వ‌చ్చే రైళ్లు

1. 20805/20806 విశాఖపట్నం- న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్

2. 18517/18518 విశాఖపట్నం- కోర్బా ఎక్స్‌ప్రెస్

3. 17487/17488 విశాఖపట్నం- కడప తిరుమల ఎక్స్‌ప్రెస్

4. 12803/12804 విశాఖపట్నం- హజారత్ నిజాముద్దీన్ స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్

5. 12807/12808 విశాఖపట్నం- హజారత్ నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్

6. 22847/ 22848 విశాఖపట్నం-ఎల్‌టీటీ వయా రాయగడ ఎక్స్‌ప్రెస్

7. 22874/22873 విశాఖపట్నం-దిఘా ఎక్స్‌ప్రెస్

8. 18519/18520 విశాఖపట్నం-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్

9. 18463/18464 భువనేశ్వర్- కేఎస్ఆర్‌ బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్

10. 22882/22881 భువనేశ్వర్-పూణె ఎక్స్‌ప్రెస్

11. 22871/22872 భువనేశ్వర్- తిరుపతి ఎక్స్‌ప్రెస్

12. 22879/22880 భువనేశ్వర్- తిరుపతి ఎక్స్‌ప్రెస్

13. 12830/ 12829 భువనేశ్వర్- ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్

14. 12845/12846 భువనేశ్వర్- ఎస్ఎంవీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్

15. 12898/ 12897 భువనేశ్వర్- పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్

16. 20896/20895 భువనేశ్వర్- రామేశ్వరం ఎక్స్‌ప్రెస్

17. 22859/22860 పూరి- ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్

నాలుగు రైళ్ల ప్రయాణ‌, చేరే వేళ‌ల్లో మార్పులు

నాలుగు రైళ్ల ప్రయాణ స‌మయాలు, చేరే వేళ‌ల్లో మార్పులు చేసింది ద‌క్షిణ మ‌ధ్య రైల్వే. అక్టోబ‌ర్ 18 నుంచి సింహపురి, ప‌ద్మావ‌తి, నారాయ‌ణాద్రి, నాగ‌ర్‌సోల్ ఎక్స్‌ప్రెస్‌లు వేళ‌లు మార‌నున్నాయి. సికింద్రాబాద్-గూడూరు సింహ‌పురి ఎక్స్‌ప్రెస్ (12710) రైలు సికింద్రాబాద్‌లో రాత్రి 11.05 గంట‌ల‌కు బ‌దులు రాత్రి 10.05 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం 8.55కి గూడూరు చేరుకుంటుంది. ఈ రైలు తెల్లవారు జామున 3.35 గంట‌ల‌కు చేరుకుంటుంది. సికింద్రాబాద్‌-తిరుప‌తి ప‌ద్మావ‌తి ఎక్స్‌ప్రెస్ (12764) రైలు ప్రయాణ వేళ‌లు గూడూరు రైల్వే స్టేష‌న్ నుంచి మారుతాయి. గూడురులో తెల్లవారు జామున 4.43 గంట‌ల‌కు బ‌దులుగా 4.19 గంట‌ల‌కు చేరుకుంటుంది. తిరుప‌తి ఉద‌యం 6.55 గంట‌ల‌కు చేరుకుంటుంది.

లింగంప‌ల్లి-తిరుప‌తి నారాయ‌ణాద్రి ఎక్స్‌ప్రెస్ (12734) రైలు సాయంత్రం 6.25కి బ‌దులుగా సాయంత్రం 5.30 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. తిరుప‌తి మ‌రుస‌టి రోజు ఉద‌యం 7 గంట‌ల‌కు బ‌దులు, ఉద‌యం 5.50 గంట‌ల‌కు చేరుకుంటుంది. ఏపీలోని న‌ర్సాపూర్ నుంచి మ‌హారాష్ట్రలోని నాగ‌ర్‌సోల్‌కి వెళ్లే నాగ‌ర్ సోల్ ఎక్స్‌ప్రెస్ (17231) రైలు రాత్రి 11.15 గంట‌ల‌కు బ‌ద‌లు, రాత్రి 9.50 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. ఉద‌యం 9.45 గంట‌ల‌కు బ‌దులు ఉద‌యం 7.30 గంట‌ల‌కు గ‌మ్యస్థానానికి చేరుకుంటుంది.

జ‌గ‌దీశ్వరరావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh NewsTrainsSpecial TrainsTrending ApHyderabadVijayawada
Source / Credits

Best Web Hosting Provider In India 2024