OTT Weekend Movies: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఈ 5 సినిమాలు మిస్ అవొద్దు!

Best Web Hosting Provider In India 2024

ఈ వీకెండ్‍లో ఓటీటీల్లోకి వచ్చిన నయా సినిమాలు చూడాలని ప్లాన్ చేసుకున్నారా.. ఈ వారం కూడా చాలా సినిమాలు, వెబ్ సిరీస్‍లు వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టాయి. కొన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు వచ్చేశాయి. బ్లాక్‍బస్టర్ మూవీ మహారాజ ఈవారమే స్ట్రీమింగ్‍కు రాగా.. హారర్ థ్రిల్లర్ కకుడా కూడా అడుగుపెట్టింది. ఇలా ఈ వీకెండ్‍లో మిస్ కాకుండా చూడాల్సిన ఐదు సినిమాలో ఏవంటే..!

మహారాజ – నెట్‍ఫ్లిక్స్

మహారాజ సినిమా థియేటర్లలో బంపర్ హిట్ అయింది. ఈ యాక్షన్ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించారు. జూన్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం తమిళం, తెలుగులో భారీ వసూళ్లను సాధించింది. మహారాజ చిత్రం రూ.110కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. ఈ సినిమా ఈ వారంలోనే జూలై 12వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళం, తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మహారాజ చిత్రానికి నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు.

వైల్డ్ వైల్డ్ పంజాబ్ తెలుగులోనూ..

వైల్డ్ వైల్డ్ పంజాబ్ చిత్రం నేరుగా జూలై 10న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ కామెడీ డ్రామా మూవీలో వరుణ్ శర్మ, సన్నీ సింగ్, మన్‍జ్యోత్ సింగ్, జెస్సీ గిల్, పత్రలేఖ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది. స్నేహితుల మధ్య బడ్డీ కామెడీ మూవీస్ ఇష్టమైతే సిమ్రన్‍ప్రీత్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ వైల్డ్ వైల్డ్ పంజాబ్ చిత్రం చూసేయండి.

ఆరంభం మరో ఓటీటీలో..

డెజావూ కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ చిత్రంగా వచ్చిన ‘ఆరంభం’కు మంచి టాక్ వచ్చింది. అజయ్ వీ నాగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ భగత్ ప్రధాన పాత్ర పోషించారు. మే 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. వసూళ్లను ఎక్కువగా దక్కించుకోలేకపోయింది. ఆరంభం చిత్రం ఈ వారం జూలై 11న ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇప్పటికే ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉన్న ఈ చిత్రం.. ఇప్పుడు ఆహాలోనూ అందుబాటులోకి వచ్చింది. సస్పెన్స్‌తో ఉండే ఈ చిత్రం ఈ వీకెండ్ చూసేందుకు మంచి ఆప్షన్‍గా ఉంది.

కకుడా నేరుగా ఓటీటీలోకి..

హారర్ కామెడీ సినిమా ‘కకుడా’ నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ చిత్రం ఈ శుక్రవారం జూలై 12వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, ప్రస్తుతం హిందీలో మాత్రమే స్ట్రీమ్ అవుతోంది. కకుడా మూవీలో రితేశ్ దేశ్‍ముఖ్, సోనాక్షి సిన్హా, షాకిబ్ సలీమ్ ప్రధాన పాత్రలు చేశారు. ఓ గ్రామంలో కుకడా అనే దెయ్యం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఆదిత్య సర్పోర్ట్‌దార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఓటీటీలో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. హారర్ కామెడీ చిత్రాలు ఇష్టమైతే జీ5లో కకుడాపై ఓసారి లుక్కేయవచ్చు. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా చూస్తే బెస్ట్.

ఆహాలో ప్లాట్

సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగు సినిమా ‘ప్లాట్’ ఆహా ఓటీటీలోకి జూలై 11వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ లో బడ్జెట్ మూవీ గత సంవత్సరం నవంబర్‌లోనే థియేటర్లలో రిలీజ్ అయింది. కొన్ని ట్విస్టులతో ఈ థ్రిల్లర్ చిత్రం ఓకే అనిపించింది. ఈ వీకెండ్‍లో ఓటీటీలో తెలుగు చిత్రం చూడాలనుకుంటే ఆహాలో ప్లాట్ కూడా మంచి ఆప్షనే.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024