OTT Web Series: ఓటీటీలో అదరగొడుతోన్న తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్.. ఇక్కడ చూసేయండి!

Best Web Hosting Provider In India 2024

Shashi Madhanam OTT Trending: ఓటీటీల్లో ఒక్కో వర్గం ప్రేక్షకులు ఒక్కో రకమైన జోనర్స్ ఇష్టపడుతుంటారు. ఎక్కువమందికి హారర్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్ అంటే నచ్చుతుంది. ఎప్పుడూ హారర్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసి బోర్ కొట్టిన వారికోసం అప్పుడప్పుడు క్యూట్ లవ్ స్టోరీ అండ్ రొమాంటిక్ జోనర్స్ సినిమాలు, వెబ్ సిరీసులు వచ్చి అలరిస్తుంటాయి.

అలా ఇటీవల ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ రొమాంటిక్ వెబ్ సిరీస్ శశిమథనం. విరూపాక్ష మూవీ ఫేమ్ సోనియా సింగ్, యూట్యూబ్ సిరీసులతో పాపులర్ అయిన పవన్ సిద్దు లీడ్ రోల్స్‌లో నటించిన క్యూట్ లవ్ స్టోరీ వెబ్ సిరీసే శశిమథనం. ఈ వెబ్ సిరీస్‌కు వినోద్ గాలి దర్శకత్వం వహించారు. హరీష్ కోహిర్కర్ నిర్మించారు.

ఫస్ట్ లుక్ పోస్టర్స్, ట్రైలర్‌తో క్యూట్ లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీగా అనిపించుకున్న శశిమథనం మంచి బజ్ క్రియేట్ చేసింది. జూలై 4 నుంచి తెలుగు ఓటీటీ ఈటీవీ విన్‌లో శశిమథనం స్ట్రీమింగ్‌కు రిలీజైంది. ఓటీటీ రిలీజ్ తొలిరోజు నుంచి శశిమథనం వెబ్ సిరీస్ ట్రెమండస్ రెస్పాన్స్‌ తెచ్చుకుంది. ఈ తెలుగు వెబ్ సిరీస్‌పై చాలా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది శశిమథనం.

ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో అదరగొడుతోన్న శశిమథనం వెబ్ సిరీస్ టాప్ 1 ప్లేసులో ట్రెండింగ్ అవుతోంది. శశిమథనం ట్రెమండస్ రెస్పాన్స్‌తో సూపర్ హిట్ అయిన నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా సక్సెస్ మీట్‌ని నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్‌లో హీరో హీరోయిన్స్, ఇతర టెక్నిషీయన్స్ తమ మనుసులోని భావాలను పంచుకున్నారు.

“నా టీవీ కెరీర్ ఈటీవీతో మొదలైయింది. మళ్లీ ఓటీటీలో ఈటీవీ విన్‌లో చేయడం చాలా ఆనందంగా ఉంది. శశిమథనంను ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్. ఆడియన్స్ సబ్ స్క్రిప్షన్ తీసుకొని మరీ చూడటం చాలా ఆనందంగా ఉంది. హరీష్ అన్న లేకపొతే ఈ ప్రాజెక్ట్ ఉండేది కాదు. అలాగే నితిన్, సాయి అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు. వినోద్ అద్భుతమైన స్క్రిప్ట్‌తో వచ్చారు. పవన్‌తో పాటు ఈ సిరిస్‌లో పని చేసిన అందరికీ థాంక్స్. మా అందరినీ ప్రోత్సహించిన ఈటీవీ విన్ కి థాంక్స్” అని హీరోయిన్ సోనియా సింగ్ చెప్పారు.

“నిర్మాత హరీష్ అన్న, నితిన్, సాయి అన్న థాంక్స్. శశిమథనం సక్సెస్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. డైరెక్టర్ వినోద్ అద్భుతంగా తీశారు. అలాగే టీంలో అందరూ ది బెస్ట్ ఇచ్చారు. ఈటీవీ విన్‌కి కృతజ్ఞతలు. మా నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్ట్‌కి మీ సపోర్ట్ కావాలి. సోనియా ఉంది కాబట్టే నేను ఇంకాస్త ఫ్రీగా ఎఫర్ట్స్ పెట్టగాలిగాను. మిగిలిన ప్రాజెక్ట్స్‌కి కూడా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్ యూ సో మచ్” అని హీరో పవన్ సిద్ధూ అన్నారు.

కాగా సోనియా సింగ్, పవన్ సిద్ధూ ఇద్దరూ యూట్యూబ్ సిరీసులతో చాలా పాపులర్ అయ్యారు. వీరిద్దరూ కలిసి ప్రేమలేఖ వంటి పలు షార్ట్ సిరీస్‌ల్లో నటించారు. ఈ జోడీకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే ఓ టీవీ షో కార్యక్రమంలో వీరిద్దరు చేసిన హంగామా నెట్టింట్లో వైరల్ కూడా అయింది.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024