Best Web Hosting Provider In India 2024
Nabha Natesh Darling Movie: పూరి జగన్నాథ్-రామ్ పోతినేని కాంబినేషన్‌లో బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్‌తో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయింది బ్యూటిఫుల్ నభా నటేష్. తొలి సినిమాతోనే టాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ అందుకుంది. దీంతో ఇస్మార్ట్ బ్యూటిగా ఆమెను తెలుగు ప్రేక్షకులు పిలుచుకోవడం స్టార్ట్ చేశారు.
అయితే ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరోయిన్‌గా నభా నటేష్ చేసిన సినిమాలు అంతగా ఆదరణ పొందలేదు. ఫెయిల్యూర్‌తో సతమతం అవుతోన్న తరుణంలో నభా నటేష్‌కు యాక్సిడెంట్ జరిగింది. దాంతో రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ నభా నటేష్.
నభా నటేష్ హీరోయిన్‌గా ప్రియదర్శి హీరోగా చేస్తున్న సినిమా డార్లింగ్. ఇందులో స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడే యువతి పాత్రలో నభా నటేష్ కనిపించింది. ఇది వరకు విడుదలైన డార్లింగ్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. మంచి ప్రమోషనల్ కంటెంట్‌తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంటోన్న డార్లింగ్ సినిమా జూలై 19న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఆసక్తకిర విశేషాలను పంచుకుంది నభా నటేష్. ఈ క్రమంలోనే ఓ హీరోతో తనకు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని చెప్పింది. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నభా నటేష్ చెప్పిన సమాధానాలు ఏంటని చూస్తే..
డార్లింగ్ డైరెక్టర్ అశ్విన్ రామ్ గురించి?
అశ్విన్ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. చాలా అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు. తను ఈ సబ్జెక్ట్‌ని హ్యాండిల్ చేసిన విధానం అద్భుతం అనిపించింది. తను కథ చెప్పినప్పుడే సినిమాని విజువలైజ్ చేయగలిగాను.
ప్రియదర్శితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
ప్రియదర్శితో కలిసి వర్క్ చేయడం చాలా బావుంది. మాఇద్దరి మధ్య నడిచే కథ. నా యాక్షన్‌కి ఆయన రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. మా కెమిస్ట్రీ అద్భుతంగా వర్క్ అయింది. తను చాలా చిల్ పర్శన్. తన కామెడీ టైమింగ్ చాలా నేచురల్‌గా వచ్చేస్తుంది.
ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతల గురించి?
వెరీ నైస్ ప్రొడ్యూసర్స్. సినిమాకి కావాల్సిన ప్రతిది ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సమకూర్చారు. యూనిక్ స్క్రిప్ట్స్‌పై నమ్మకం పెడతారు. అలాంటి పాషన్ ఉన్న నిర్మాతలతో పని చేయడం ఆనందంగా ఉంది.
వివేక్ సాగర్ మ్యూజిక్ గురించి?
వివేక్ సాగర్ నా ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్. నా కెరీర్‌లో ఫస్ట్ టైం సోలో ట్రాక్ డార్లింగ్‌లో దొరికింది. ఈ పాట అద్భుతంగా వచ్చింది. అలాగే ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. బీజీఎం కూడా అద్భుతంగా చేశారు.
మీకు ఏ జోనర్ చిత్రాలు ఇష్టం?
నాకు అన్ని రకాల సబ్జెక్ట్స్ ఇష్టం. ప్రతిసారి కొత్తగా చేయాలనేది నా ప్రయత్నం.
మీకు డ్రీమ్ రోల్స్ ఉన్నాయా?
డార్లింగ్‌లో చేసిన రోల్ నా డ్రీమ్ రోల్.
కొత్తగా చేస్తున్న సినిమాలు?
స్వయంభూతో పాటు మరో రెండు సినిమాలు డిస్కర్షన్‌లో ఉన్నాయి. ప్రస్తుతం డార్లింగ్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను.