Mrs Radhika look: మిస్సెస్ అంబానీగా రాధిక మర్చంట్ మొదటి లుక్ ఫోటోలు.. అబ్బురపరిచే వివరాలివే

Best Web Hosting Provider In India 2024

రాధికా మర్చంట్ రెండో రోజు వెడ్డింగ్ లుక్ వచ్చేసింది. రంగురంగుల, పూలతో, అద్భుతంగా, గ్లామరస్ గా ఉన్న ఆమె వస్త్రధారణ రాధిక సొగసును, లగ్జరీని ప్రతిబింబిస్తుంది. శనివారం అంబానీ కుటుంబం ‘ఆశీర్వాద్’ వేడుకను నిర్వహించింది. ఇందులో వధువు తన అద్భుతమైన శైలితో అందరినీ ఆకట్టుకుంది. రాధిక లుక్ అంబానీలకు ప్రసిద్ధి చెందిన రాయల్ లగ్జరీ ఫ్యాషన్ ను ప్రతిబింబించింది.

 

ఈ డ్రెస్ మీద ఉన్న ఫ్లోరల్ ప్రింట్ నుంచి రాధిక అందం వరకు ప్రతిదీ ఈ లుక్ లో అద్భుతంగా కనిపించింది. ఈ లుక్ కు సంబంధించిన పూర్తి వివరాలు, ఫోటోలు చూసేయండి.

అబూ జానీ సందీప్ ఖోస్లా:

సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ రియా కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో రాధికా మర్చంట్ కు సంబంధించిన అద్భుతమైన ఫోటోలను షేర్ చేసి ఫ్యాషన్ ప్రియులను ఆనందపరిచింది. రాధిక అద్భుతమైన గులాబీ దుస్తులను వివరిస్తూ.. , “కళ, ఫ్యాషన్ రెండూ ప్రేమికులు. ఒకరు లేకుండా మరొకరు ఉండలేరు”అంటూ రియా తన ఖాతాలో రాసుకొచ్చింది. రాధిక లుక్ నిజంగా చిరకాలం గుర్తుండిపోయే ఆర్ట్ వర్క్. ఆమె లుక్ అందాన్ని ఆస్వాదించడానికి ఒక్క క్షణం కేటాయించాల్సిందే.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rhea Kapoor (@rheakapoor)

లుక్ వివరాలు:

రాధిక అంబానీ వధువుగా సమకాళీన కళాకారిణి జయ శ్రీ బర్మన్, స్టైలిస్ట్ రియా కపూర్ సహకారంతో అబూజానీ సందీప్ ఖోస్లా ఈ లుక్ డిజైన్ చేయడం సాధ్యమైంది. ప్రత్యేక ఇటాలియన్ కాన్వాస్ పై 12 హ్యాండ్ పెయింట్ వేసిన ప్యానెల్స్ తో కూడిన ఈ లెహంగా జయశ్రీ పౌరాణిక దార్శనికతకు జీవం పోసినట్లు ఉంది. ఇది అనంత్, రాధికల బంధాన్ని ఈ చిత్రాలలో గాఢమైన అర్థంతో రూపొందించారు. దీని మీదున్న మనిషి బొమ్మలు ఆనందంగా ఉన్న జంటను తెలియజేస్తే, ఏనుగులు, పూలు, హంసలు ఇతర బొమ్మలు అనంత్‌కు జంతువుల మీద ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తాయి.

 

ఈ లెహెంగాలో నిజమైన బంగారు జర్దోజీ ఎంబ్రాయిడరీ, జయశ్రీ కళాకృతులను హైలైట్ చేసే సీక్వెన్ల వరుసలు ఉన్నాయి. అబు జానీ సందీప్ ఖోస్లా మాస్టర్ క్రాఫ్ట్స్ మెన్ డిజైన్ చేసిన రేషమ్-ఎంబ్రాయిడరీ బ్లౌజ్ తో ఈ లెహెంగా జత చేశారు.దీనిపై జయశ్రీ కామెంట్ చేశారు. అబూ, సందీప్ లు ఆర్టిస్టులని, వారి మాధ్యమం దుస్తులైతే, నాది కాన్వాస్ అని అన్నారు. రియా, అబూ సందీప్ ఇద్దరూ నాకు పూర్తి సృజనాత్మక స్వేచ్ఛను ఇచ్చారు. నా బ్రష్ ను కాన్వాస్ పై నృత్యం చేయడానికి అనుమతించారు. ఈ కళాఖండం రాధిక ముఖంలో చిరునవ్వు తెస్తుందని, బహుశా ఏదో ఒక రోజు ఆమె గోడపై దీనికి స్థానం లభిస్తుందని నేను ఆశిస్తున్నాను అన్నారామె.

 

 
WhatsApp channel
 

టాపిక్

 
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024