Indian OTT: 28 ఏళ్ల క్రితం రిలీజైన క‌ల్ట్ క్లాసిక్ మూవీ…ఇప్పుడు ఓటీటీలోకి వ‌స్తోంది!

Best Web Hosting Provider In India 2024


Indian OTT: క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 1996లో రిలీజైన ఇండియ‌న్ మూవీ క‌ల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. దాదాపు ఇర‌వై ఎనిమిది ఏళ్ల త‌ర్వాత ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది. జూలై 15న‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియ‌న్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇండియ‌న్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ ఆఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. 4కే వెర్ష‌న్‌లో ఈ మూవీని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

డ్యూయ‌ల్ రోల్‌…

ఇండియ‌న్ మూవీలో క‌మ‌ల్‌హాస‌న్ డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించాడు. బ్రిటీష‌ర్ల‌ను ఎదురించి పోరాడిన స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడిగా, లంచ‌గొండిత‌నాన్ని నిర్మూలిస్తూ అవినీతి ప‌రులను అంత‌మొందించే సేనాప‌తిగా, చంద్ర‌బోస్ అనే న‌వ‌త‌రం యువ‌కుడిగా రెండు పాత్ర‌లో అస‌మాన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టాడు.ఇండియ‌న్ సినిమాకు గాను బెస్ట్ యాక్ట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డును సొంతం చేసుకున్నాడు క‌మ‌ల్ హాస‌న్‌.

యాభై కోట్ల క‌లెక్ష‌న్స్‌….

ఇండియ‌న్ మూవీలో మ‌నీషా కొయిరాలా, ఊర్మిళ మండోట్క‌ర్‌తో పాటు సుక‌న్య హీరోయిన్లుగా న‌టించారు. దాదాపు ప‌దిహేను కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ అప్ప‌ట్లోనే 50 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. కోలీవుడ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన మూవీగా ఇండియ‌న్ రికార్డు చాలా ఏళ్ల పాటు ప‌దిలంగా ఉంది. ఈ త‌మిళ మూవీ తెలుగులో భార‌తీయుడు పేరుతో, హిందీలో హిందుస్థానీగా డ‌బ్బింగ్ రూపంలో విడుద‌లై కాసుల వ‌ర్షం కురిపించింది.

ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ ప్ల‌స్‌…

శంక‌ర్ అందించిన క‌థ‌, క‌థ‌నాల‌పై ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ కూడా ఈ సినిమా విజ‌యంలో కీల‌క భూమిక పోషించింది. ఇండియ‌న్ సినిమా మూడు నేష‌న‌ల్ అవార్డుల‌ను గెలుచుకొని చ‌రిత్ర‌ను సృష్టించింది. బెస్ట్ యాక్ట‌ర్‌గా క‌మ‌ల్‌హాస‌న్‌తో పాటు బెస్ట్ ఆర్ట్ డైరెక్ష‌న్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ఈ సినిమాకు పుర‌స్కారాలు ద‌క్కాయి.

సీక్వెల్‌లో మ్యాజిక్ మిస్‌…

ఇండియ‌న్ మూవీకి సీక్వెల్‌గా ఇండియ‌న్ 2 ఈ శుక్ర‌వారం పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజైంది. సేనాప‌తి పాత్ర‌ను ప్ర‌ధానంగా చేసుకొని డైరెక్ట‌ర్ శంక‌ర్ ఈ సీక్వెల్‌ను తెర‌కెక్కించాడు. ఇండియ‌న్ మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయ‌డంలో విఫ‌లం కావ‌డంలో ఇండియ‌న్ 2 డిజాస్ట‌ర్ టాక్‌ను తెచ్చుకున్న‌ది.

కాన్సెప్ట్ ఔట్ డేటెడ్ కావడం, సేనాప‌తి క్యారెక్ట‌ర్‌ను ప‌వ‌ర్‌ఫుల్‌గా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేయ‌డంలో శంక‌ర్ త‌డ‌బ‌డ్డారు. రెండు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ 42 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను మాత్ర‌మే రాబ‌ట్టింది. ఈ సీక్వెల్‌లో సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. ఇండియ‌న్ 2కు కొన‌సాగింపుగా ఇండియ‌న్ 3 కూడా రాబోతోంది.

కల్కి 1000 కోట్లు…

ఇండియ‌న్ 3లో కాజ‌ల్ అగ‌ర్వాల్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ఇండియ‌న్ 3ని రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తోన్నారు. ఇండియ‌న్ 2తో పాటు ఇండియ‌న్ 3 సినిమాల‌ను లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. ఇటీవ‌ల రిలీజైన ప్ర‌భాస్ క‌ల్కి మూవీలో క‌మ‌ల్‌హాస‌న్ విల‌న్‌గా క‌నిపించాడు. సుప్రీమ్ యాస్కిన్ అనే రోల్ చేశాడు. ఈ సూప‌ర్ హీరో మూవీ వెయ్యి కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి రికార్డు సృష్టించింది.

WhatsApp channel

టాపిక్

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024