Best Web Hosting Provider In India 2024
విజయవాడ: జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీలోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవడని మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు కొడాలి నాని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పార్టీలోకి ఎన్టీఆర్‌ను ఆహ్వానించడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ తప్పుకుని టీడీపీని ఎన్టీఆర్‌కు అప్పగించాలని సూచించారు. మార్పు రాష్ట్రంలో కాదు..టీడీపీలో రావాలన్నారు. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణను చంద్రబాబు హోరంగా అవమానించలేదా అని నిలదీశారు. హరికృష్ణపై తాగుబోతు, తిరుగుబోతు అని ఈనాడులో ప్రచారం చే యించాడని గుర్తు చేశారు. హరికృష్ణకు పదవులు ఇవ్వకుండా పార్టీకి దూరం చేశాడని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకొని వదిలేశారన్నారు. చంద్రబాబు, లోకేష్ బొమ్మతో ఓటు అడిగే ధైర్యం లేదన్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌ను రమ్మంటున్నారని ఎద్దేవా చేశారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించడమేంటని నిలదీశారు. టీడీపీ మహానాడు పెట్టి వారసుడి కోసం ఎన్టీఆర్, లోకేష్‌లకు ఓటింగ్ పెట్టండి చంద్రబాబు నాయకత్వంలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందని కొడాలి నాని అభిప్రాయపడ్డారు.