Best Web Hosting Provider In India 2024
పశ్చిమ గోదావరి: ఉండి మాజీ శాసనసభ్యులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు ఆదర్శమూర్తి అని ఉమ్మడి గోదావరి జిల్లాల వైయస్ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్, లోక్ సభ సభ్యులు, లోక్ సభ పక్షనేత మిధున్ రెడ్డి కొనియాడారు. ఈ నెల 18న గుండెపోటుతో మరణించిన క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు సంతాప సభ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్రాజు చిత్రపటానికి మిథున్‌రెడ్డి, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, శ్రీరంగనాథరాజు, తదితరులు నివాళులర్పించారు. ఈ క్రమంలోనే పాతపటి సర్రాజు కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. పాతపాటి సర్రాజు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.