ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల టౌన్ :
ది.05-8-2022(శుక్రవారం) ..
కంచికచర్ల పట్టణంలో వాలంటీర్లు -సచివాలయ సిబ్బంది- అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
“గడపగడపకు- మన ప్రభుత్వం” కార్యక్రమంలో ప్రజలు తెలిపిన సమస్యలపై – పరిష్కారాల పై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు ..
కంచికచర్ల పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో గ్రామ పంచాయతీ అధికారులు మరియు వాలంటీర్లు -సచివాలయ సిబ్బందితో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం చేపట్టిన “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమం కంచికచర్ల పట్టణంలోని “సచివాలయం-2” పరిధిలో పూర్తయిందని – ఆ సచివాలయం పరిధిలో ప్రజలు తెలిపిన సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం తరఫున అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని , అదేవిధంగా ఆ సచివాలయ పరిధిలో డ్రైనేజీ సమస్య -రోడ్డు సమస్య – వాటర్ లైన్ సమస్య – మరియు అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం నుండి ఒక్కో సచివాలయానికి విడుదల కానున్న రూ.20 లక్షలతో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి – వాటి అంచనా విలువ తదితర అంశాలపై నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు , ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏదైనా సాంకేతిక సమస్య కారణంగా అందటం లేదని గడపగడప కు- మన ప్రభుత్వం కార్యక్రమంలో నమోదు చేసుకున్న అర్జీలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు ,
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మలక్ బషీర్ ,గ్రామ సర్పంచ్ వేల్పుల సునీత , ఉప సర్పంచ్ వేమా సురేష్ బాబు , ఈవో రవి కుమార్ మరియు అధికారులు పాల్గొన్నారు ..