Best Web Hosting Provider In India 2024

గుంటూరు: ‘‘వరుసగా నాలుగో ఏడాది, మూడో విడత వైయస్ఆర్ రైతు భరోసా–కిసాన్ కింద నేడు అందిస్తున్న రూ.1090 కోట్లతో కలిపి ఈ ఒక్క పథకం ద్వారా నాలుగేళ్లు కూడా గడవకముందే రైతన్న కుటుంబాలకు మీ బిడ్డ అందించిన సాయం అక్షరాల రూ.27,062 కోట్లు. రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే ఇదీ.. రైతన్నల మీద మమకారం అంటే ఇదీ.. వ్యవసాయం మీద ప్రేమ అంటే ఇట్టా ఉంటుందని సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తెనాలి వేదికగా వరుసగా నాలుగో ఏడాది, మూడో విడత వైయస్ఆర్ రైతు భరోసా సాయాన్ని సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు. అక్షరాల 51.12 లక్షల మంది రైతులకు రూ.2 వేల చొప్పున రూ.1090.76 కోట్లను బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. అదే విధంగా మాండూస్ తుపాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేశారు.